వైసీపీకి రాజీనామా.. వెంటనే యూటర్న్‌ ఏం జరిగింది…!

November 10, 2018 at 12:29 pm

ఏపీలో ఎన్నికల వేడి రాజుకోవడంతో చాలా నియోజకవర్గాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఏ పార్టీకి సహకరిస్తారో ఊహించడం కష్టంగానే మారింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఇప్పటి వరకు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా పని చేసిన తోట సుబ్బారావు నాయుడు ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. అయితే కార్యకర్తలు ఆయనపై తీవ్రమైన ఒత్తిడి చెయ్యడంతో తిరిగి అరగంటలోనే తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ నుంచి పెద్దాపురంలో పోటీ చేసిన తోట సుబ్బారావు నాయుడు ప్రస్తుత హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పపై 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.42474839_244641632916566_1114178941091840_n

అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడుతూ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతున్నారు. అయితే ఆర్థికంగా ఆయన కాస్త వీక్‌ అవ్వడంతో జగన్‌ నియోజకవర్గానికి చెందిన ఎన్నారై ద‌వులూరి దొరబాబుకు నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు. ఈ విషయంలో అలకబూనిన సుబ్బారావు నాయుడు కార్యకర్తల సమక్షంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సుబ్బారావు నాయుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే కార్యకర్తలు ఒక్క సారిగా అయోమయానికి గురి అయ్యారు. పార్టీకి రాజీనామా చెయ్యవద్దని రాజీనామా ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చెయ్యడంతో ఆయన తాత్కాలికంగా తన రాజీనామాను కేవలం అరగంటలోనే ఉపసంహరించుకోవడం విశేషం.44737974_253552612025468_261868485364154368_n

పార్టీ అధికారంలోకి వస్తే సుబ్బారావు నాయుడికి మంచి పదవి ఇస్తామని జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకులు సైతం హామీ ఇవ్వడంతో ఆయన తిరిగి పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పెద్దాపురంలో బలంగా ఉన్న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, హోమ్‌ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను ఢీ కొట్టాలంటే ఆర్థికంగా బలమైన దొరబాబు అయితేనే కరెక్ట్ అని భావించిన జగన్‌ సుబ్బారావు నాయుడు స్థానంలో ఆయనకు పగ్గాలు అప్పగించారు. అ క్రమంలోనే ఆయన అలకబూనడం జరిగింది. ఇక ఎన్నారై అయిన ద‌వులూరి దొరబాబు ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఇటీవల జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర నియోజకవర్గంలో సక్సెస్‌ అవ్వడంలో ఆయన విశేష కృషి చేశారు. ఈ క్రమంలో జగన్‌ ఆయనకు నియోజకవర్గ బాధ్యాతలు అప్పగించారు.

వైసీపీకి రాజీనామా.. వెంటనే యూటర్న్‌ ఏం జరిగింది…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share