న‌గ‌రిలో రోజాకు “కుల” పోటు…

May 14, 2019 at 12:30 pm

రోజా.. సినీ రంగం నుంచి పొలిటిక‌ల్ వేదిక‌పైకి వ‌చ్చిన ఈ తార‌.. అటు సినీ రంగంలోనూ ఇటు రాజ‌కీయ రంగంలోనూ త‌న‌దైన శైలితో దూసుకుపోతోంది. టీడీపీలో ప్రారంభించిన ప్ర‌స్థానం.. త‌ర్వాత కాంగ్రెస్‌లోకి చేరుదామ‌ని అనుకుని ఏకంగా జ‌గ‌న్ పెట్టిన వైసీపీలోకి చేరి 2014లో త‌న ఎమ్మెల్యే కావాలనే క‌ల‌ను సాకారం చేసుకుంది. అయితే, అక్క‌డితో రోజా ఆగిపోయి ఉంటే ప‌రిస్థితి వేరేగా ఉండేది. మిగిలిన మ‌హిళా ఎమ్మెల్యేల‌తో స‌మానంగా భావించాల్సి వ‌చ్చేది. అయ‌తే, రోజా అలా ఎన్న‌డూ ఉండ‌లేదు. ఆమె నోరు తెరిస్తే.. నిప్పులు రాలాయి. అధికార ప‌క్షంపై ఆమె విమ‌ర్శ‌లు సంధిస్తే.. అగ్ని ప‌ర్వాతాలు పేలాయి. 

ఏకంగా ముఖ్యమంత్రిని, సాక్షాత్తూ అసెంబ్లీలోనే కామ సీఎం అంటూ సంబోధించి రోజా రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృ ష్టించారు. అంతేకాదు, వైసీపీని కాపాడుకోవ‌డంలోను, పార్టీ అధినేత జ‌గ‌న్‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు రాకుండా చేసుకోవడం లోను రోజా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. ఇది ఒక‌ర‌కంగా ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాల్లోను, అటు పార్టీలోను కూడా గుర్తింపు తెచ్చిపెట్టినా.. మ‌రోప‌క్క‌, వ్య‌క్తిగ‌తంగా ఆమెకు పార్టీలోనే శ‌త్రువుల‌ను పెంచింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం నిత్యం మీడియా ద్వారా గ‌ళం వినిపించ‌డం, పాద‌యాత్ర చేయ‌డం, జ‌గ‌న్‌పై వ‌చ్చే విమ‌ర్శ ల‌ను తిప్పికొట్ట‌డం నేప‌థ్యంలో రేపు జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. రోజాకు ఖ‌చ్చితంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన ప‌రిస్తితి ఉంటుంది. 

మంత్రి ప‌ద‌వి ఖాయంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే జ‌రిగితే.. ఇప్ప‌టికే దూకుడు మీదున్న రోజా .. ఇక‌, జ‌గ‌న్ కేబినెట్లో నూ అదే దూకుడు కొన‌సాగిస్తే.. త‌మ ప‌రిస్థితి దారుణంగా త‌యార‌వుతుంద‌ని కొంద‌రు నేత‌లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సొంత సామాజిక వ‌ర్గం రెడ్డి నేత‌లు రోజాకు వెనుక గోతులు తీశార‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో గెలిచిన రోజా.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా అక్క‌డ నుంచే పోటీ చేశారు. విస్తృతంగా ప‌ర్య‌టించారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుసుకున్నారు. ప్ర‌చారాన్ని హోరెత్తించారు. 

అయితే, ఎంత తీవ్రంగా రోజా త‌న గెలుపు కోసం ప్ర‌య‌త్నించిందో అంతే వేగంగా ఆమె ఓడిపోవాల‌ని తెర‌చాటున కొంద‌రు సొంత పార్టీ సీనియ‌ర్ నేత‌లు ప్ర‌య‌త్నించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఈ నేప‌థ్యంలో రోజా గెలుపు సాధ్య‌మా?  అసాధ్య‌మా? అన్న‌ది ఈ నెల 23న తేల‌నుంది. ఇక్క‌డ కొస‌మెరుపు ఏంటంటే..టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన గాలి ముద్దుకృష్ణ వార‌సుడు గాలి భానుప్ర‌కాశ్ కు కూడా సొంత ఇంటి నుంచే పొగ ఎదురుకావ‌డం!! మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

న‌గ‌రిలో రోజాకు “కుల” పోటు…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share