వైసీపీ షాకింగ్ బెట్టింగ్‌… అక్కడ ఒక్క సీటు గెలిచినా పందెం టీడీపీదే

May 11, 2019 at 11:11 am

ఏపీలో పొలిటికల్ బెట్టింగ్‌ల‌కు గుంటూరు జిల్లా అడ్డాగా మారింది. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద కూడా గుంటూరు కేంద్రంగా కోట్లాది రూపాయిలు చేతులు మారాయి. తెలంగాణ నుంచి పలువురు బెట్టింగ్ రాయుళ్లు సైతం గుంటూరు వచ్చి మరి పాల్గొన్నారు అంటే పొలిటికల్ బెట్టింగుల‌కు గుంటూరు ఎలా ? కేంద్ర బిందువుగా మారింద‌ని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సారి గుంటూరు జిల్లాలో వైసిపి బెట్టింగ్ రాయుళ్లు సవాళ్లు రువ్వి మరి పందేలకు దిగుతున్నారు. ఏపీలో వైసీపీ గెలుస్తుంది, జగన్ సీఎం అవుతున్నాడు అన్న బెట్టింగ్‌ల‌ నుంచి అనేక రకాల బెట్టింగ్‌లు గుంటూరు కేంద్రంగా నడుస్తున్నాయి. టిడిపి కంటే వైసీపీకి ఒక్క సీటు అయినా ఎక్కువ వస్తుందని కూడా బెట్టింగ్‌లో కాసే వైసీపీ సానుభూతిపరులు సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది.

ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా రకరకాల బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. సహజంగానే గుంటూరు జిల్లాలో టిడిపి ఆధిపత్యం ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలోని 17 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లను టిడిపి క్లీన్ స్వీప్‌ చేసింది. 17 అసెంబ్లీ సీట్లకు 12 సీట్లను గెలుచుకున్న టిడిపి తన సత్తా చాటింది. ఇక ఈ ఎన్నికల్లో టిడిపితో సమానంగా సీట్లు సాధిస్తాన‌న్న ధీమాతో ఉన్న వైసిపి కాలం క‌లిసి వ‌స్తే టీడీపీ కంటే ఒక‌టి రెండు సీట్లు త‌మ‌కు ఎక్కువే వ‌స్తాయ‌ని కూడా చెబుతోంది. ఇదిలా ఉంటే పల్నాడు ప్రాంతంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై వైసీపీ నేతలు ఆసక్తికరమైన పందెం వేస్తున్నారు. నరసరావుపేట లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలో ఉన్న నరసరావుపేట, స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోటీచేసిన సత్తెనపల్లి, వైసిపికి పట్టున్న మాచర్ల నియోజకవర్గాలను కలిపి ఈ మూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ గెలుస్తుందని, ఒక నియోజకవర్గంలో టిడిపి గెలిచినా తాము పందెం వదులుకుంటామని సవాల్ చేస్తున్నారు.

వైసిపి పందెంరాయుళ్లు వెర్ష‌న్‌ ప్రకారం ఈ మూడు సీట్లలో వైసీపీ గెలిస్తేనే వైసిపి సానుభూతిపరుల‌కు పందెం వెళ్తుంది. మూడు సీట్లలో ఒక్క చోట టిడిపి గెలిచినా పందెం టిడిపి సానుభూతిపరులకే వెళ్తుంది. దీనిని బట్టి వైసీపీ సానుభూతిపరులు ఈ మూడు నియోజకవర్గాల్లో ఎంత ధీమాతో ఉన్నారో తెలుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో పరిస్థితి విశ్లేషిస్తే మాచర్లలో 1999 తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లో టిడిపి ఓడిపోతుంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి పిన్మెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కూడా కొట్టారు. ఈ ఎన్నికల్లో ఆయన వరుసగా నాలుగో సారి బరిలో ఉన్నారు. టిడిపి నుంచి రాజకీయాలకు కొత్త అయిన‌ యువకుడు అన్నపురెడ్డి అంజిరెడ్డి బరిలో ఉన్నారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా అంజిరెడ్డి గట్టి పోటీ ఇచ్చారని అంటున్నారు. టిడిపి వర్గాలు మాత్రం ఈ సారి మాచర్లలో తప్పకుండా తమ పార్టీ గెలుస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.

ఇక లోక్‌స‌భ నియోజకవర్గ కేంద్రమైన నరసరావుపేట నుంచి టిడిపి బిసి అస్త్రాన్ని ప్రయోగించింది. బిసి వర్గానికి చెందిన చదలవాడ అరవింద్ బాబు టిడిపి అభ్యర్థిగా పోటీ చేయగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పై 16 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన గోపిరెడ్డి ఈ సారి కూడా సులువుగా గెలుస్తారని వైసిపి ధీమా వ్యక్తం చేస్తోంది. అరవింద బాబుకు చివరిలో అభ్యర్థిత్వం ఖరారు కావడం, డబ్బు పంపిణీలో వెనకబడటం, కోడెల వర్గం నుంచి సహాయ నిరాకరణ లాంటి అంశాలు ఆయనకు మైనస్ అవుతున్నాయన్న అంచనాలో వైసిపి ఉంది. ఇక న్యూట్రల్ జనాలు సైతం నరసరావుపేటలో అరవింద బాబు గట్టి పోటీ ఇచ్చారని… ఆయన ఓడిపోయినా మూడు నుంచి నాలుగు వేల ఓట్ల వ్యత్యాసం ఉంటుందని చర్చించుకుంటున్నారు. నరసరావుపేట అసెంబ్లీ సీటుపై వైసిపి ప్రత్యేకమైన పందేలు కూడా కాస్తోంది. టీడీపీ గెలిస్తే లక్షకు నాలుగు లక్షలు ఇస్తామని సవాల్ చేసి మరి పందాలకు రెడీ అవుతుంది. ఈ రేషియోలో ఈ సీటుపై ఇప్పటికే చాలా పందెం నడిచింది.

స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోటీచేసిన సత్తెనపల్లిలో ఈ సారి ఆయన ఓటమి గ్యారెంటి అని వైసీపీ అప్పుడే సంబరాలు స్టార్ట్ చేసేసింది. ఐదేళ్ల పాటు స్పీకర్ కోడెల కుటుంబ సభ్యుల తీరుతో కోడెలపై అక్కడ తీవ్రమైన వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. అదే టైంలో అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి రాంబాబును సైతం మార్చాలని వైసీపీ లీడర్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. ఇటు కోడెల‌ అభ్యర్థిత్వాన్ని మార్చాలని టి.డి.పి వాళ్లు సైతం భారీ ఎత్తున నిరసనలకు దిగారు. ఏదేమైనా చంద్రబాబు జగన్ ఇద్దరు తిరిగి కోడెల, అంబ‌టికే సీట్లు ఇచ్చారు. గత ఎన్నికల్లోనే కేవలం 700 కోట్ల అత్తెసరు మెజార్టీతో గట్టెక్కిన కోడెల‌ ఈ సారి భారీ వ్యతిరేకత నేపథ్యంలో ఓడిపోతారని చాలా మంది చెబుతున్నారు.

ఇదే ఇప్పుడు సత్తెనపల్లిలో తాము గెలుస్తామన్న వైసీపీ ధీమాకు ప్రధాన కారణం. గత ఎన్నికల్లో నరసరావుపేట మాచర్లలో మాత్రమే వైసీపీ గెలిచింది. ఈ ఎన్నికల్లో ఈ మూడు సీట్లలో తామే గెలుస్తామని వైసీపీ చెబుతుంటే టిడిపి లెక్కలు వేరుగా ఉన్నాయి. ఈ మూడు సీట్లలో రెండు సీట్లు టిడిపి గెలుస్తుందని… టిడిపి గత మూడు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్నా నరసరావుపేట, మాచర్లలో ఒక సీటును తాము ఖచ్చితంగా గెలుచుకుంటామని చెబుతున్నారు. నరసరావుపేట కంటే మాచర్ల పైనే టిడిపి ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఏదేమైనా వైసిపి సవాల్ పందెంలో గెలుస్తుందో ? లేదో చూడాలి.

వైసీపీ షాకింగ్ బెట్టింగ్‌… అక్కడ ఒక్క సీటు గెలిచినా పందెం టీడీపీదే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share