జ‌గ‌న్ కేబినెట్‌లో ప‌శ్చిమ నుంచి రెండు బెర్త్‌లు కన్ఫర్మ్!

April 29, 2019 at 5:24 pm

ఎన్నిక‌లు ముగిసిన ఏపీలో ఫ‌లితాల‌పై చ‌ర్చోప చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? అనే చ‌ర్చ జో రుగా సాగుతోంది. అయితే, దీనికి మెజారిటీ ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స‌మాధానం వైసీపీ అనే! అంతేకాదు, జ‌గ‌న్‌ను ఒక్క సారి చూద్దాం అనే వారి సంఖ్య కూడా ఈ ద‌ఫా ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల త‌ర్వాత కూడా క‌నిపించింది. దీంతో మే 23నాటి ఫ‌లితాల కంటే కూడా జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తార‌ని చెబుతున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వేళ జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. ఎవ‌రికి ఆయ‌న కేబినెట్‌లో చోటు ద‌క్కుతుంది? ఎవ‌రిని జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటారు? అనే చ‌ర్చ కూడా జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే న‌గ‌రి నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి, రెండోసారి కూడా విజ‌యం ద‌క్కించుకునేందుకు రెడీఅయిన రోజా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. చిత్తూరు నుంచి ఆమెకే అవ‌కాశం ఉంద‌ని కూడా అంటున్నారు. ఇక,ఇప్పుడు తాజా గా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నుంచి కూడా జ‌గ‌న్ కేబినెట్‌లో ఇద్ద‌రికి సీట్లు రిజ‌ర్వ్ అయ్యాయ‌ని చెబుతున్నారు లోట‌స్ పాండ్ లోని జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులుగా ఉన్న నాయ‌కులు. ఏలూరు పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌ ఆళ్ల‌నానికి జ‌గ‌న్ మంత్రి ప‌దవిని ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. గ‌తంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నాని. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో నాని ఓడిపోయారు.

అయిన‌ప్ప‌టికీ.. నాని వైఎస్ ఫ్యామిలీకి న‌మ్మిన బంటుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు జ‌గ‌న్ ఎమ్మెల్సీ కూడా ఇచ్చి గౌర‌వించారు. ఇక‌, కాపుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావిస్తున్న జ‌గ‌న్‌.. ఆ కోటాలో నానికి బెర్త్ ఖ‌రారు చేసే అవ‌కాశం మెండుగా ఉంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి కాపుల నుంచి మంత్రి ప‌దవుల కోసం పోటీ ఉన్న‌ప్ప‌టికీ.. న‌మ్మిన బంటుగా ఉన్న నానికి అన్యాయం చేయ‌రాద‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. ఇక‌, పోల‌వ‌రం ఎమ్మెల్యే అభ్య‌ర్థి తెల్లం బాల‌రాజుకు కూడా ఎస్టీ కోటాలో జ‌గ‌న్ బెర్త్ ఖ‌రారు చేశార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న హ్యాట్రిక్ కొట్టారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం ఓట‌మి పాల‌య్యారు. అయినా కూడా పార్టీని నిల‌బెట్టేందుకు కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని కృషి చేశారు. ఈ నేపథ్యంలో జ‌గ‌న్ బాల‌రాజుకు పెద్ద‌పీట వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

జ‌గ‌న్ కేబినెట్‌లో ప‌శ్చిమ నుంచి రెండు బెర్త్‌లు కన్ఫర్మ్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share