రికార్డ్ స్థాయిలో అసెంబ్లీకి వైసీపీ లేడీ ఎమ్మెల్యేలు

May 22, 2019 at 6:36 pm

ఏపీలో విపక్ష వైసీపీ తాజా ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలకు సీట్లు ఇచ్చి పెద్ద సంచలనాలకు తెర లేపింది. ఎంపీ సీట్ల విష‌యానికి వ‌స్తే కాకినాడ నుంచి వంగ గీత, అర‌కు నుంచి గొడ్డేటి మాధ‌వి, అమ‌లాపురం నుంచి చింతా అనురాధ‌, అన‌కాప‌ల్లి నుంచి కాండ్రేగుల వెంక‌ట స‌త్య‌వ‌తి వైసీపీ త‌ర‌పున పోటీ చేశారు. అంటే వైసీపీ నుంచి ఈ ఎన్నిక‌ల్లో న‌లుగురు మ‌హిళ‌లు లోక్‌స‌భ‌కు పోటీ ప‌డ్డారు. అలాగే వైసీపీ తరపున పోటీ చేసిన మహిళల్లో ఈ సారి ఎక్కువ మంది గెలిచే ఛాన్సులు ఉండడంతో అసెంబ్లీలో వైసిపి మహిళలతో ఈసారి సరి కొత్త సందడి నెలకొననుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి పోటీ చేసిన రెడ్డి శాంతి గెలుపు దాదాపు ఖరారైంది. అదే జిల్లాలోని పాల‌కొండ ఎస్టీ రిజ‌ర్వుడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బ‌రిలో ఉన్న విశ్వ‌న‌రాయ క‌ళావ‌తి మ‌రో సారి విజ‌యం సాధించ‌నున్నారు. అంటే ఒక్క శ్రీ‌కాకుళం జిల్లా నుంచే వైసీపీ త‌ర‌పున ఇద్ద‌రు మ‌హిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు.

ఇక విజయనగరం జిల్లా కురుపాం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పాముల పుష్ప శ్రీవాణి మరోసారి గెలవనున్నారు. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన మ‌హిళ‌ల్లో విశాఖ తూర్పులో పోటీ చేసిన అక్ర‌మాని విజ‌య నిర్మ‌ల గెలుపు క‌ష్టం కాగా… పాడేరు నుంచి కొట్టంగుళ్ల‌ భాగ్య‌ల‌క్ష్మి భారీ మెజారిటీతో విజ‌యం సాధించ‌నున్నారు. ఇక పెద్దాపురంలో హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప మీద పోటీ చేసిన తోట వాణి రాజ‌ప్ప‌కు గ‌ట్టి ఫైట్ ఇచ్చారు. ఇక్కడ అదే జిల్లాలోని రంపచోడవరం ఎస్టీ రిజర్వుడు నుంచి పోటీ చేసిన నాగుల‌ప‌ల్లి ధ‌న‌లక్ష్మి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడమే తరువాయి. ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో కొవ్వూరు రిజ‌ర్వుడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన తానేటి వ‌నిత గెలుపు ఖ‌రారు అయింది. అమె గ‌తంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించ‌గా ఇప్పుడు రెండో సారి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తానేటి వ‌నిత పేరు మంత్రి ప‌ద‌వి రేసులో కూడా వినిస్తోంది.

రాజధాని జిల్లా అయినా గుంటూరులో జగన్ ఏకంగా ముగ్గురు మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి పెద్ద సంచలనం రేపారు. జిల్లాలో రెండు రిజ‌ర్వుడ్ సెగ్మెంట్లు అయిన తాడికొండ నుంచి డాక్ట‌ర్‌ ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి, ప్ర‌త్తిపాడు నుంచి మాజీ ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత రంగంలో ఉడ‌గా మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు నియోజ‌క‌వ‌ర్గ‌మైన చిల‌క‌లూరిపేట‌లో బీసీ వ‌ర్గానికి చెందిన ఎన్నారై విడ‌ద‌ల ర‌జ‌నీని జ‌గ‌న్ రంగంలోకి దింపారు. ఇక క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నుంచి కేఈ. కృష్ణ‌మూర్తి త‌న‌యుడు కేఈ. శ్యాంబాబుపై చెరుకుల‌పాడు శ్రీ‌దేవి పోటీ చేశారు. భ‌ర్త చెరుకుల‌పాడు నారాయ‌ణ రెడ్డి హ‌త్య‌కు గుర‌వ‌డంతో జ‌గ‌న్ ప‌ట్టుప‌ట్టి శ్రీ‌దేవికి పాద‌యాత్ర ప్రారంభంలోనే అభ్య‌ర్థిత్వం ఖ‌రారు చేశారు. ప‌త్తికొండ‌లో శ్రీ‌దేవి శ్యాంబాబును ఓడించి సంచ‌ల‌నం క్రియేట్ చేసే దిశ‌గా దూసుకు వెళ్తున్నారు.

అనంత‌పురం జిల్లాలోని సింగ‌న‌మ‌ల ఎస్సీ సీటు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి తిరిగి పోటీ చేశారు. ఓడినా ఐదేళ్ల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌డంతో ఈ సారి ప‌ద్మావ‌తి గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కే కానుంది. ఇక క‌ళ్యాణ‌దుర్గంలో ఉషాశ్రీ‌ చ‌ర‌ణ్ టీడీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఇక చంద్ర‌బాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా న‌గ‌రిలో వైసీపీ లేడీ ఫైర్ బ్రాండ్ ఆర్‌కే రోజా వ‌రుస‌గా రెండో సారి గెలుపు బాట‌లో ఉండ‌డంతో పాటు ఈ సారి జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్ కూడా ఖాయం చేసుకోనుంద‌న్న వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఏదేమైనా ఈ సారి అసెంబ్లీలో వైసీపీ నుంచి లేడీ లీడ‌ర్ల సంద‌డి మామూలుగా ఉండేలా లేదు. వీరిలో రెండు నుంచి మూడు మ‌హిళా కేబినెట్ బెర్త్‌లు కూడా ఉండ‌నున్నాయి.

రికార్డ్ స్థాయిలో అసెంబ్లీకి వైసీపీ లేడీ ఎమ్మెల్యేలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share