జ‌గ‌న్‌ విజయానికి మూడు కారణాలు ఇవే ?

May 24, 2019 at 12:51 pm

రాజ‌కీయ అప‌ర‌చాణిక్యుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ఊహించ‌ని విధంగా విజ‌యాన్ని కూవ‌సం చేసుకున్నారు జ‌గ‌న్‌. ఉమ్మ‌డి రాష్ట్రంలో 2004లో జ‌గ‌న్ తండ్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి సాధించిన 156 సీట్ల రికార్డుల‌ను ఇప్పుడు 175 స్థానాలున్న ఏపీలో జ‌గ‌న్ సాధించి మ‌రో స‌రికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయ‌న అనుస‌రించిన వ్యూహం ఏంటి? ఆయ‌న వేసిన అడుగులు ఏంటి? ఏ వ్యూహం ఆయ‌న‌కు ఇంత‌టి ఘ‌న విజ‌యం క‌ట్టబెట్టింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ముఖ్యంగా మూడు అంశాలు తెర మీదికి వ‌స్తున్నాయి. నినాదం, హామీ, అభ్య‌ర్థ‌న అనే మూడు అంశాలు ప్రాతిప‌దిక‌గానే జ‌గ‌న్ త‌న ప్ర‌స్థానంలో విజ‌యం ద‌క్కించుకున్నార‌నే కంక్లూజ‌న్ వినిపిస్తోంది.

2017లో జ‌గ‌న్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పాద‌యాత్ర‌ను ప్రారంభించిన‌ప్పుడు `రావాలి జ‌గ‌న్… కావాలి జ‌గ‌న్‌` అనే పాల‌ను ప్ర‌చారం చేయిచారు. ఇది సామాన్యుల్లోకి అత్యంత వేగంగా వెళ్లింది. చిన్న పిల్ల‌ల నుంచి పామ‌రుల వ‌ర‌కు కూడా ఈ గీతాన్ని పాడేలా చేశారు. త‌ద్వారాప్ర‌త్యామ్నాయ రాజ‌కీయం స్ప‌ష్ట‌మైంది. ఇక‌, అదే సంవ‌త్స‌రం విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన పార్టీ ప్లీస‌రీలో `న‌వ ర‌త్నాల‌` హామీని ప్ర‌క‌టించారు. ఇది క్షేత్ర‌స్థాయిలో భారీ ఎత్తున పుంజుకుంది. ప్ర‌తి ఇంటికీ వైసీపీ శ్రేణులు దీనిని ప్ర‌చారం చేశాయి. ఇక‌, అదేస‌మ‌యంలో `ఒక్క చాన్స్‌` అని అభ్య‌ర్థించారు. చివ‌రికి.. అనుకున్న‌ది సాధించారు. ఇది వైసీపీ నేత‌లు కూడా ఊహించ‌నంత ఘ‌న విజ‌యం.

గ‌త తాజా ఎన్నిక‌ల్లో హామీల విష‌యంలో జ‌గ‌న్ ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు. ఈ సారి `గెలిచి తీరాలి` అనే ల‌క్ష్యంతో.. భారీగా ప‌రాలు గుప్పించారు. రైతుల‌కు పెట్టుబ‌డి స‌హాయం నుంచి పిల్ల‌ల‌ను బ‌డికి పంపించే త‌ల్లుల‌కు న‌గ‌దు, వృద్ధాప్య పింఛ‌ను రూ. 3వేలు… ఇలా `న‌వ ర‌త్నాలు` ప్ర‌క‌టించారు. ఇవి జ‌నంలోకి బ‌లంగా వెళ్లాయి. అదే స‌మ‌యంలో `జ‌యం మ‌న‌దే. నో డౌట్ అంటూ వైసీపీ 2014లో మితిమీరిన విశ్వాసం క‌న‌బ‌రిచింది. చంద్ర‌బాబు సామ‌ర్ధ్యాన్ని త‌క్కువ అంచ‌నా వేసింది. ఈ సారి ఆ త‌ప్పు చేయ‌లేదు. “ పోల్‌మేనేజ్‌మెంట్లో చంద్ర‌బాబును ఢీకొట్ట‌లేం. మ‌నం ఎంత చేసినా ఆయ‌న‌కంటే వెనుక‌బ‌డే ఉంటాం“ అనే అభిప్రాయంతో ముందునుంచీ పూర్తి అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించింది. ప్ర‌తి ద‌శ‌లో, ప్ర‌తి అడుగూ ప‌క్కాగా వేశారు.

అదేవిధంగా వైసీపీ కీల‌క నేత‌ల‌ను ఒక వేదిక‌పైకి తెచ్చి.. 2014 ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క శాతం ఓటు తేడాతో ఓడిపోయాం. మాకంటే ఐదు ల‌క్ష‌ల ఓట్లు ఎక్కువ తెచ్చుకుని టీడీపీ అధికారం సొంతం చేసుకుంది అని జ‌గ‌న్ ప‌దే ప‌దే చెప్పేవారు. అసెంబ్లీకి వెళ్లిన ప్ర‌తిసారీ, ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబును చూసిన ప్ర‌తిసారి ఈ ఒక్క‌శాతం ఓటే జ‌గ‌న్‌కు గుర్తుచ్చేది. అందుకే .. ఆ సారి `ప్ర‌తి ఓటూ కీల‌కం` అంటూ మొద‌టి నుంచీ జాగ్ర‌త్త‌ప‌డుతూ వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలోనే `ఒక్క అవ‌కాశం ఇస్తే.. శాశ్వ‌తంగా ప్ర‌జ‌లు గుండెల్లో నిలిచిపోయేలా పాల‌న అందిస్తా… జ‌గ‌న్ ప‌దే ప‌దే చెప్పారు. మొత్తంగా జ‌గ‌న్ విజ‌యం వెనుక భారీ వ్యూహాత్మ‌క అడుగులు ప‌డ్డాయ‌నే వాటిని ఇది రుజువు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్‌ విజయానికి మూడు కారణాలు ఇవే ?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share