బీజేపీ వైపు వైసీపీ సీనియ‌ర్‌ ఎమ్మెల్యే !

July 12, 2019 at 11:18 am

తెలుగు రాష్ట్రాలపై వేసిన బిజెపి రెండు రాష్ట్రాల నుంచి గ్రామస్థాయి లీడ‌ర్ల నుంచి ఎంపీల వరకు ఎవరు పార్టీలోకి వచ్చినా చేర్చేసుకుంటోంది. ఇప్పుడు బిజెపికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బలం ఉన్న నేతలు కాదు కావాల్సింది… తమకు కౌంట్ పెరిగితే చాలు అన్నట్టు గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిజెపి కన్ను వైసిపి మీద కూడా పడింది. బిజెపికి ఇప్పుడు ప్రధాన టార్గెట్ వైసీపీయే. ఈ నేప‌థ్యంలోనే గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నేతకు జగన్ తాజా కేబినెట్లో చోటు కల్పించలేదు.

ఇందుకు ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు ప్రధాన కారణం. ఆ మాజీ మంత్రిని జగన్ అసలు లెక్కలోకి తీసుకోవడం లేదు. ఒకప్పుడు జిల్లాను త‌న క‌నుసైగ‌ల‌తో శాసించిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు నియోజకవర్గానికి పూర్తిగా పరిమితమైపోయారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఉత్తరాంధ్రలో బీజేపీ అంత బలంగా లేదు. రాజకీయంగా అనుభవం ఉన్న ఇలాంటి సీనియర్ నేతలు తమ పార్టీలో చేరితే మేల‌ని భావిస్తోంది.

ఈ క్రమంలోనే విశాఖ సిటీ పై కన్నేసిన బిజెపి… ఇప్పుడు ఆ మాజీ మంత్రిని కూడా పార్టీలో చేర్చుకుని ఉత్తరాంధ్రలో తమకు సీనియర్ నేతలు ఉన్నారని అనిపించుకోవాలని చూస్తుంది. అయితే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రిని తీసుకోవడానికి కొందరు నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అటు వైఎస్ హయాంలో ఆయ‌న‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయని… ఆయన పార్టీలోకి తీసుకుంటే భవిష్యత్తులో మన పార్టీకి కూడా ఆ మ‌లికీ అంటుతుందని చెబుతున్నారట.

అయితే బీజేపీ పెద్దలు మాత్రం ప్రస్తుతం ఏపీలో పార్టీకి కీలక నాయకుల అవసరం ఉందని… ఎలాంటి వారు పార్టీలోకి వచ్చిన ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చేర్చుకోవాలని పైగా ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీలోకి వస్తానంటే చేర్చుకోకుండా ఎలా ? ఉంటామని ప్రశ్నిస్తున్నారట. ఏదేమైనా ఆ మాజీ మంత్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని వదిలి బీజేపీలోకి వెళితే ఏపీ రాజకీయాల్లో మరో సంచలనానికి కారణమ‌వుతుంది.

బీజేపీ వైపు వైసీపీ సీనియ‌ర్‌ ఎమ్మెల్యే !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share