ఏపీలో మ‌రో సంచ‌ల‌న స‌ర్వే… వైసీపీదే గెలుపు

May 22, 2019 at 12:57 pm

ఏపీలో సార్వత్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఇప్ప‌టికే వెలువ‌డిన స‌ర్వేలు అన్ని వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చేశాయి. కేంద్రంలో అందరూ బీజేపీకే పట్టం కట్టగా.. ఏపీలో మాత్రం 90 శాతం స‌ర్వేలు వైసీపీకే ప‌ట్టం క‌ట్టేశాయి. ప‌లు నేష‌న‌ల్ మీడియా సంస్థ‌ల‌తో పాటు కొన్ని లోక‌ల్ ఛానెల్స్ వైసీపీ గెలుస్తుంద‌ని చెపితే… లగడపాటి, చాణక్య మరో రెండు సంస్థలు టీడీపీ వైపు మొగ్గుచూపాయి. ఓవ‌రాల్‌గా మెజార్టీ స‌ర్వేలు అన్ని వైసీపీ వైపే క్లియ‌ర్ క‌ట్‌గా ఉన్నాయి.

ఇక తాజాగా కాస్త లేటుగా మ‌రో ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ త‌న ఎగ్జిట్‌పోల్స్ ప్ర‌క‌టించింది. ప్రఖ్యాత జాతీయ మీడియా సంస్థ ది హిందూ దినపత్రిక – సీఎస్డీఎస్-లోక్ నీతి సంస్థలతో కలిసి చేసిన స‌ర్వేలో కేంద్రలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో ఎన్డీఏకు 40-42 శాతం వరకు ఓట్ షేరింగ్ జరిగితే… యూపీఏ ఓట్ షేరింగ్ కేవ‌లం 28-30 శాతానికే ప‌రిమిత‌మైన‌ట్టు చెప్పింది. ఇతరులకు 18-20శాతం వరకూ ఓట్ షేరింగ్ ఉందని ఈ సర్వే చెప్పింది.

ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే వైసీపీకి 43 శాతం ఓట్లు వ‌స్తే, టీడీపీ 38 శాతంతో స‌రిపెట్టుకున్న‌ట్టు తేల్చింది. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కేవ‌లం 2 శాతం ఓట్ల తేడాతో అధికారంలోకి వ‌స్తే.. ఈ సారి వైసీపీ, టీడీపీ మ‌ధ్య ఏకంగా 5 శాతం ఓట్ల అంత‌రం ఉంద‌ని హిందూ స‌ర్వే చెప్పింది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 2 శాతం ఓట్ల తేడాతో టీడీపీకి 102 సీట్లు – వైసీపీకి 67 సీట్లు వ‌చ్చాయంటే… ఇప్పుడే 5 శాతం తేడాతో వైసీపీ పెద్ద ప్ర‌భంజ‌న‌మే సృష్టిస్తుంద‌ని తేలింది. ఈ స‌ర్వేలో వైసీపీకి దాదాపుగా 18-22 లోక్ సభ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. టీడీపీకి 3-6 సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది.

ఏపీలో మ‌రో సంచ‌ల‌న స‌ర్వే… వైసీపీదే గెలుపు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share