`లోక‌ల్` కూడా జ‌గ‌న్‌దే..!

June 26, 2019 at 10:04 am

ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ, సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దుమ్ముదులిపిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. క‌నీవినీ ఎరుగ‌ని, ఎవ‌రూ ఊహించ నైనా ఊహించ‌లేని స్థాయి మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చారు. ఎంపీల విష‌యంలోనూ ఆయ‌న త‌న స‌త్తా చాటుకున్నా రు. ఎన్నో విధాలుగా ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకున్న అప్ప‌టి అధికార‌పార్టీ టీడీపీ కూడా ఎక్క‌డా కోలుకోలేని విధంగా దు మ్ముకొట్టుకుపోయింది. జ‌గ‌న్ సునామీ దెబ్బ‌కు టీడీపీకి మైండ్ బ్లాంక్ అయి.. ఇప్ప‌టికీ కోలుకోలేని స్తితిలోనే ఉండ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యంగా ఉంది. అస‌లు ఎందుకు ఓడిపోయామో.. అర్ధం కావ‌డం లేదు. అని చంద్ర‌బాబు స్వ‌యంగా వ్యాఖ్యా నించారంటే.. జ‌గ‌న్ సునామీ ధాటి ఏవిధంగా ఉందో ఇట్టే అర్ధ‌మ‌వుతోంది.

ఇక‌, వ‌చ్చే రెండు మూడు మాసాల్లో ఖ‌చ్చితంగా చెప్పాలంటే.. అక్టోబ‌రు నెలాఖ‌రు నాటికి స్తానిక సంస్థ‌లైన గ్రామ‌, మండ‌ల పంచాయితీలు, న‌గ‌ర‌, పుర‌పాల సంస్థ‌లు, కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాలి. దీనికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు గ‌తంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే రిజ‌ర్వేష‌న్ల ప్ర‌క్రియను పూర్తి చేసి.. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే త‌రువాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ తాజాగా వేస్తున్న అడుగులు చాలా వ‌ర‌కు చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. సీఎంగా సంతకం చేస్తూనే జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు.

రాష్ట్రంలోని అన్నిగ్రామాల్లోనూ గ్రామ వలంటీర్ల‌ను నియ‌మిస్తాన‌ని, వారికి నెల‌కు రూ.5 వేల చొప్పున గౌర‌వ‌వేతనం అంది స్తాన‌ని చెప్పారు. అంతేకాదు, వీరి ద్వారా ప్ర‌భుత్వం నుంచి ప్ర‌జ‌ల‌కు అందే ప్ర‌తి ప‌నినీ ఇంటికే పంపిస్తామ‌ని(డోర్ డెలి వ‌రీ) చెప్పారు. ఈ వ‌లంటీర్ల నియామ‌కానికి సంబంధించిన క్ర‌తువు కూడా ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల ప్ర‌కారంఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీకి ఓటువేసిన వారు ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీకి వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, గ్రామ వలంటీర్లు, ఇంటికే ప్ర‌భుత్వ ప‌థ‌కాల పంపిణీ, గ్రామ స‌చివాల‌య ఉద్యోగుల వ్య‌వ‌స్థ తెర‌మీదికి వ‌చ్చాక ఇప్పుడు జ‌గ‌న్‌కే గ్రామాల్లో ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతున్నారు.

రాను రాను ఇది మ‌రింత బ‌లోపేతం అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. స్తానికంగా బ‌ల‌ప‌డాల‌ని భావించిన టీడీపీ, కాంగ్రెస్‌, జ‌న‌సేన వంటి పార్టీలు పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితి ఉంది. అదేస‌మ‌యంలో అన్ని స్థానికాల‌ను వైసీపీ గుండుగుత్తుగా సొంతం చేసుకునే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంది. స్థానిక ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టికే త‌న ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీనే క‌నిపించాల‌ని పేర్కొన్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

`లోక‌ల్` కూడా జ‌గ‌న్‌దే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share