వైసీపీ గెలుపెవ‌రిది? పీకేదా? జ‌గ‌న్‌దా?

May 23, 2019 at 1:12 pm

రాష్ట్రంలో ఎన్నిక‌ల సునామీ! ఇటీవ‌ల కాలంలో క‌నీ వినీ ఎరుగ‌ని విధంగా వైసీపీ ప్ర‌భంజన ర‌థం ప‌ట్ట‌ప‌గ్గాల్లేని ప‌యనం తో దూసుకుపోతోంది. ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీ కంచుకోట‌ల‌ను బ‌ద్ద‌లు కొట్టి.. మ‌రీ సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో ప్ర‌జ‌ల తీర్పు గురువారం ఉద‌యాన్నే పెను సంచ‌ల‌నం సృష్టించింది. ఎన్నాళ్లో వేచిన ఉద‌యం అన్న‌ట్టుగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌జ‌లు త‌మ వంతు స‌హ‌కారం అందించిన‌ట్టు స్ఫ‌ష్టంగా క‌నిపిస్తోంది. నిజానికి ప‌శ్చిమ‌గోదావ‌రిలో గ‌త 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీ బోణీ కొట్ట‌లేదు. అలాంటి చోట్ల కూడా ఇప్పుడు వైసీపీ హ‌వా జోరుగా క‌నిపిస్తోంది.

అయితే, వైసీపీ సునామీ వెనుక ఒక్క జ‌గ‌న్ మాత్ర‌మే పాజిటివా? ఇంకే అంశాలూ లేవా? అనే చ‌ర్చ మొద‌లైంది. నిజానికి 2014 ఎన్నిక‌ల్లోనే విజ‌యం సాధించాల్సి ఉన్నా.. కేవ‌లం 1% ఓట్ల తేడాతో జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో మ‌రింత క‌సితో ఆయ‌న దూసుకుపోయారు. ఎట్టిప‌రిస్థితిలో నూ 2019లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు దూకారు. ఈ క్ర‌మంలోనే బిహార్‌కు చెందిన ఐఐటీయెన్‌.. రాజ‌కీయ స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిశోర్‌(పీకే) ను త‌న‌కు రాజ‌కీయ స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. 2017 నుంచి అంటే 2019 ఎన్నిక‌ల‌కు ఖ‌చ్చితంగా రెండేళ్ల‌కు ముందు నుంచి పీకే సూచ‌న‌లు పాటించారు.

ఇక‌, పీకే కూడా జ‌గ‌న్ ఆశ‌లు నెర‌వేర్చేందుకు త‌న వ్యూహాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే పాద‌యాత్రను తెర‌మీదికి తెచ్చారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించే ఛాన్స్ అందిపుచ్చుకుని పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టించారు. ఇక‌, జ‌గ‌న్ కూడా సుదీర్ఘ పాద‌యాత్ర‌లో విరామం లేకుండా ముందుకు సాగారు. ప్ర‌తి గ్రామాన్ని క‌లియ‌దిరిగారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుసుకున్నారు. మొత్తంగా ప్ర‌జ‌ల అభిమానాన్నిచూర‌గొన్నారు. ఈ ప్ర‌క్రియ‌లో అటు వ్యూహ ర‌చ‌న చేసిన పీకే గెలిచారా? లేక ఇటు వ్యూహాల‌ను అమ‌లు చేసి ప్ర‌జ‌ల‌కు చేరువ అయిన జ‌గ‌న్ గెలిచారా అంటే., ఇద్ద‌రూ కూడా క‌సితో క‌ల‌సి ప‌నిచేసిన నేప‌థ్యంలో మొత్తంగా ఇరువురూ గెలిచార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

వైసీపీ గెలుపెవ‌రిది? పీకేదా? జ‌గ‌న్‌దా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share