టీ కాంగ్రెస్ లో కోవర్టులు వున్నారా ?

అస‌లు తెలంగాణ‌ కాంగ్రెస్ పార్టీలో కోవ‌ర్టులు ఉన్నారా, ఈకోవ‌ర్టుల‌తో పార్టీకి న‌ష్టం జ‌రుగుతుందంటారా, ప్రస్తుత ప‌రిణామాలు చూస్తుంటే ఔన‌న్పిస్తోంది. కాంగ్రెస్ పెద్ద‌లు మాత్రం కోవ‌ర్ట‌ల‌తో పార్టీకీ తీవ్ర న‌ష్టం జ‌రుగుతంద‌ని, దీనిపై అధిష్టానం చోర‌వ తీసుకోవాల‌ని, లేకుంటే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఖాతా క్లోజ్ ఆవుతుంద‌ని టీకాంగ్రెస్ లో కొంత‌మంది పెద్ద‌ల అధిష్టానం ముందు వాద‌న‌లు విన్పిస్తున్నారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీకి130ఏళ్ల రాజ‌కీయ‌ చ‌రిత్ర ఉందని, ఏంతోమంది నాయ‌కులను త‌యారు చేసింద‌ని, కాంగ్రెస్ పార్టీ స‌ముద్రం లాంటిద‌ని ఇలాంటి పార్టీలోకి ఎంతోమంది వ‌స్తుంటారు, పోతుంటార‌ని కాంగగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే చెప్తుంటారు. అలాంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోవ‌ర్ట్ లు ఉన్నార‌ని, టీ కాంగ్రెస్ లోని కొంద‌రు నేత‌లు బ‌హిరంగంగా చెప్తుతున్నారు. ఆ కోవ‌ర్ట్ లే పార్టీలో కీల‌క ప‌ద‌వులు అనుభ‌విస్తున్నార‌ని, దీంతో తెలంగాణ‌లో కాంగ్రెస్ కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఖాతా క్లోజ్ అయే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని, దీనిని అధిష్టానం ప‌ట్టించుకోవాల‌ని, పార్టీని బ‌లోపేతం చేసేందుకు పెద్ద‌లు చోర‌వ తీసుకోవాల‌ని టీ కాంగ్రెస్ లో కొంద‌రి పెద్ద‌లు వాపోతున్నారు.

టీ కాంగ్రెస్ పార్టీలో జానా రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి లాంటి కోవ‌ర్ట్ లు ఉన్నార‌ని, ఇలాంటి నేత‌ల‌ను అధిష్టానం న‌మ్మొద‌ని, వీరి వల్ల పార్టీ ఇమెజ్ డామెజ్ ఆవుతుంద‌ని సమాచారం. ఈమాట‌లు అంటుది ఎవ‌రో కాదు స్వ‌యంగా కాంగ్రెస్ పార్టీలో రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప‌ద‌వి అనుభ‌విస్తున్న‌పాల్వ‌యి గోవ‌ర్ధ‌న్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ప‌ద‌వులు అనుభ‌విస్తు, టిఆర్ఎస్ ప్ర‌భుత్వ‌నికి కెసిఆర్ కు ఏజేంట్ లు గా ప‌ని చేస్తున్నార‌ని పాల్వ‌యి ఇటీవల సోనియాతో పాటు మ‌రికోంత‌మంది డీల్లీ పెద్ద‌ల‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ కోవ‌ర్ట్ ల‌తో పార్టీ న‌ష్టం పోతుంటే, మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దిగ్విజ‌య‌సింగ్ తో మ‌రికొంత న‌ష్టం జ‌రుగుతుంద‌ని, దీనిపై అధిష్టానం సీరియ‌స్ గా దృష్టి పెట్టడంతోపాటు దిగ్విజ‌య్ సింగ్ను మార్చాల‌ని అప్పుడే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్ ఉంటుంద‌ని లేకుంటే తీవ్రంగా న‌ష్టం జ‌రుగుతంద‌ని పాల్వ‌యి అధిష్టానానికి ఫిర్యాదు చేశార‌ట‌.
దీనిపై అధిష్టానం నుంచి ఎలాంటి స్పంద‌న ఉంటుందో వేచి చూడాలి.