బాబు పంచాయ‌తీ వెనుక వైసీపీ!

June 5, 2018 at 10:25 am

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కొన్ని పంచాయితీల‌కు నాలుగేళ్లు గ‌డిచిపోతున్నా.. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం లేదు. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి ఈ ఎన్నిక‌ల‌కు ప్ర‌భుత్వ‌మే ముందుండి అడుగులు వేయాలి. కానీ, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం ఆదిశ‌గా అడుగులు వేయ‌డం లేదు. జిల్లాలో మొత్తం 921 పంచాయితీలు ఉన్నాయి. వీటికి 2013లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో మిశ్ర‌మ ఫ‌లితాలు వ‌చ్చాయి. అయితే, కొన్ని అనివార్య‌కార‌ణాల‌తో 15 చోట్ల స‌ర్పంచు పోస్టులు ఖాళీ అయ్యాయి. అదేవిధంగా 168 వార్డు స‌భ్యుల ఖాళీలూ ఉన్నాయి. ఏపీ పంచాయ‌తీరాజ్ చ‌ట్టం ప్ర‌కారం వీటికి నిర్ణీత కాలంలోనే ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. వీటిని నిర్వ‌హించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైనే ఉంది. అయితే, ప్ర‌భుత్వం మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పంచాయితీలు ఇంచార్జుల పాల‌న‌లోనే ఉన్నాయి.

వాస్త‌వానికి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సర్పంచ్‌ కానీ, వార్డు మెంబర్‌ కానీ మరణించినా, రాజీనామా చేసిన ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవ డం లేదని ఆయా పంచాయితీల బాధ్య‌లు, ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. ఇక‌, ఈ పంచాయితీల నిర్వ‌హ‌ణ‌కు ఇంచార్జుల ను నియ‌మించినా.. వారు నామ‌మాత్రంగా మారిపోయారు. మొత్తం వ్య‌వ‌హారాల‌న్నీ.. కూడా టీడీపీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లో న‌డిచే జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు అప్ప‌గించారు. వీరే అన్నీ తామై ఆయా పంచాయితీల్లో చ‌క్రం తిప్పుతున్నారు. బినామీ నాయకులు అధికారం వెలగబెడుతూ గ్రామాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు.

పంచాయతీలకు ఉప ఎన్నికలు నిర్వహించకపోవడంతో పలువురు కోర్టుకు వెళ్లారు., దీంతో కోర్టుకు వెళ్లిన పంచాయితీ ల్లో మాత్రమే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎన్నిక‌లు నిర్వ‌హించింది. మిగిలిన పంచాయ‌తీల‌ను గాలికి వ‌దిలేసింద‌ని విమ ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎందుకు పంచాయతీల్లో ఉప ఎన్నికలు నిర్వహించడం లేదన్న చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున నడుస్తోంది. ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి చెందుతామనే ఆలోచన రావడం వల్లే ఎన్నికలు నిర్వహించడం లేదని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. 2013 జూన్‌లో జిల్లాలోని 921 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అప్పటి నుంచి వివిధ కారణాల వల్ల 15 సర్పంచ్‌లు, 168 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

కానీ ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీని వల్ల సదరు గ్రామాలు, వార్డుల్లో అభివృద్ధి కుంటు పడుతోంది. ప్రతిపక్షం వైసీపీ ఇక్క‌డ బ‌లంగా ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ కార‌ణంగానే ప్రభుత్వం ముందుకు రావడం లేదనే మ‌రో టాక్ కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మొత్తంగా ఓ జిల్లా ప‌రిధిలో 168 వార్డుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీలు పాల‌న సాగిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మరి ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు స్పందిస్తారో లేదో చూడాలి.

బాబు పంచాయ‌తీ వెనుక వైసీపీ!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share