కేసీఆర్‌పై నాయిని ధిక్కార స్వరం

September 9, 2019 at 3:01 pm

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతున్నాయి. ఈట‌ల రాజేంద‌ర్‌, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ఏదో ఒక రూపంలో త‌మ అసంతృప్తి బ‌య‌ట పెట్టుకున్నారు. ఇక తాజాగా టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొన‌సాగుతున్న నాయిని ఇప్పుడు త‌న అసంతృప్తి బ‌య‌ట పెట్టారు. నాయిని టీఆర్ఎస్ నాయకత్వంపై హాట్ కామెంట్స్ చేశారు.

కార్పొరేషన్ చైర్మన్ గా నాయినికి త్వరలో పదవి ఇవ్వబోతున్నారన్న వార్తలపై ఆయన స్పందించారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ తన ఇచ్చిన మాట తప్పారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే… ‘ముఠా గోపాల్ ను గెలిపించుకురా… మంత్రిని చేస్తా’అని హామీ ఇచ్చారని అన్నారు. ఆ సమయంలో.. ‘నా కైనా, మా అల్లుడికి అయినా టికెట్ ఇవ్వమని ఆడిగాం. కానీ అలా జరగలేదు. ఇపుడు నాకు ఏ కార్పొరేషన్ చైర్మన్ పదవి వద్దు’ అని అన్నారు నాయిని నర్సింహారెడ్డి.

రాష్ట్ర హోం శాఖ మంత్రిగా చేసి ఇపుడు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానంటే అది ఎవరికి కావాలి… అందులో ర‌సం లేద‌ని నాయిని విరుచుకుప‌డ్డారు. ‘టీఆర్ఎస్ లో నేను కూడా ఓనర్ నే. కిరాయికి వచ్చినవాళ్ళు ఎప్పుడు దిగిపోతారో తెలియదు’ అని ఘాటుగా విమ‌ర్శించారు. ఏదేమైనా కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన నాయిని చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల ఇప్పుడు టీఆర్ఎస్‌లో తీవ్ర క‌ల‌క‌లం రేగుతోంది. ఇవి ఎటు దారితీస్తాయో ? చూడాలి.

కేసీఆర్‌పై నాయిని ధిక్కార స్వరం
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share