మంచు విష్ణు కామెంట్ మా అన్న జగన్ గ్రేట్

June 1, 2018 at 7:31 pm

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్పయాత్ర’ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి అన్ని వైపుల నుంచి స్వాగతాలు మెండుగా పలుకుగున్నారు జనాలు. అంతే కాదు సినీమా నటులు కూడా ఆయనను కలుస్తున్నారు. ఈ మద్య థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కమీడియన్ ఫృథ్వి కూడా జగన్ మోహన్ ని కలిశారు. ఇక పోసాని కృష్ణ మురళి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..ప్రతిసారి వైఎస్ జగన్ తరుపు నుంచి మాట్లాడుతూనే ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకోవడానికి..వారి సమస్యలపై ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల గురించి ప్రజలకు తెలియజెప్పడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చరిత్రాత్మకమని హీరో మంచు విష్ణు వర్ధన్‌ అభిప్రాయడ్డారు. అంతే కాదు ఇప్పటి వరకు పాదయాత్ర చేసిన వారు ఇప్పటికే అపజయం పాలు కాలేదు. ఇది రాజుల కాలం నాటి నుంచి వస్తున్న వ్యవహారమే అని అన్నారు హీరో విష్ణు.

గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. సాధారణంగా ఎవరైనా ఐదు, పది కిలో మీటర్లు ప్రయాణిస్తే..అమ్మా..అయ్యా అంటారు..నా వరకు నేను ఐదు కిలో మీటర్లు పరిగెడితే అలసి పోతాను. కానీ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా రెండు వేల కిలో మీటర్లు పయాణం చేయడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. శుక్రవారం తణుకులోని స్ప్రింగ్‌ బోర్డు పాఠశాలలో మంచు విష్ణు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఏపీలో ప్రస్తుత విద్యావ్యవస్థలో మార్పులు రావాల్సివుందని, విద్యార్థికి ర్యాంకులు, మార్కులే ప్రామాణికం కాదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చిన్న నాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుంటే..ఏ విషయంలోనైనా విజయాలు సాధించవొచ్చని అన్నారు. విద్యార్థి దశ నుంచి పిల్లలకు విలువలు నేర్పడం వల్ల వారు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారని చెప్పారు. కాగా, మంచు విష్ణు తర్వాతి చిత్రం ‘ఓటర్‌’ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత రాజకీయాలను ప్రతిబింబించేలా తెరకెక్కనుంది.

మంచు విష్ణు కామెంట్ మా అన్న జగన్ గ్రేట్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share