ఛాన్స్ చిక్కింది.. బాబును మోడీ అలా కుమ్మేశారుగా..

June 10, 2019 at 12:27 pm

అస‌లే కుత‌కుత‌లాడుతున్న కోపం. కేంద్రంలోని త‌మ సార‌ధ్యాన్నే త‌క్కువ చేసిన నాయ‌కుడిని ఏకి పారేయాల‌నే ఉక్రో షం.. త‌మ‌కు వ్య‌తిరేకంగా చ‌క్రాలు తిప్పార‌నే అమితాగ్ర‌హం.. త‌మ జ‌ట్టును వీడి.. కాంగ్రెస్ పంచ‌న చేరార‌నే తాపం.. వెర‌సి వీట‌న్నింటిపై క‌సి తీర్చుకోవాల‌ని ఎదురు చూసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. వ‌చ్చిన అవ‌కాశాన్ని విచ్చ‌ల విడిగా వినియోగించుకున్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుపై దుమ్ముదులిపేశారు. తాజాగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన మోడీ.. అవ‌కాశం చిక్క‌డంతో అటు జ‌గ‌న్‌ను నేరుగా కొనియాడుతూనే.. ప‌రోక్షంగా చంద్ర‌బాబును ఏకిప‌డేశారు.

శ్రీవారి ప‌ర్య‌ట‌న కోసం వ‌చ్చిన మోడీతో బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం.. ప్ర‌జా అభినంద‌న స‌భను నిర్వ‌హించింది. ఈ సంద ర్భంగా స‌భ‌ను ఉద్దేశించి మాట్లాడిన మోడీ.. చాలా సేపు దేశం, రాష్ట్రంలో బీజేపీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. అదేస‌మ యంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు. ఏపీలో బ‌ల‌మైన ప్ర‌భుత్వం ఏర్పాటైంద‌ని, ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు చెబుతున్నాన‌ని అన్న మోడీ.. అక్క‌డి నుంచి వ‌రుస‌గా చంద్ర‌బాబును టార్గెట్ చేశారు. కొంద‌రు ఓట‌మిని జీర్ణించుకోలేక పోతున్నార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటి నుంచి బ‌య‌ట‌కు కూడా రాలేద‌ని మోడీ విరుచుకుప‌డ్డారు.

“కొందరు ఎన్నికల ఫలితాల ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేదు. అది వారి బలహీనత. బీజేపీ వరకూ ఎన్నికల ఘట్టం ముగిసింది. 130 కోట్లమంది ప్రజలకు సేవ చేసే అధ్యాయం ప్రారంభమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వా మ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో కృషి చేసిన వారికి నా ధన్యవాదాలు. బీజేపీకి ఎన్నిక లొక్కటే పరమావధి కా దు. కార్యకర్తలు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని భవ్య భారత నిర్మాణంలో పాల్గొనేలా వ్యవస్థ ఉంది. కేంద్రం తీసుకొచ్చే కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో అమలు చేసి చూపిస్తాం“ అని మోడీ అన్నారు. మొత్తానికి నేరుగా అన‌క‌పోయినా.. చంద్ర‌బాబును ఉద్దేశించి న‌ర్మ‌గ‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారాయి. ప్ర‌ధానే ఇలా అన్నారంటే.. కింది స్థాయి నేత‌లు ఇక రేప‌టి నుంచి బాబుకు కౌంట‌ర్‌ల‌పై కౌంట‌ర్లు ఇస్తారేమో చూడాలి.

ఛాన్స్ చిక్కింది.. బాబును మోడీ అలా కుమ్మేశారుగా..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share