A.P బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా జూనియ‌ర్‌..?

July 22, 2019 at 6:06 pm

రాష్ర్టాభివ్రుద్ధిలో ప‌ర్యాట‌కానిదే పెద్దపీట‌. స‌ర్కార్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా, ప్ర‌యోగాలు చేసినా ప్ర‌జ‌ల‌కు చేర‌డానికి సుల‌వైన మార్గం ఎంతైనా అవ‌స‌రం. అందునా సినిమా హీరోనో, పేరెన్నిక గ‌ల ప్లేయ‌రో అయితే ఆ ప్ర‌యోజ‌నం నెర‌వేరుతుంది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ కూడా ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ప్ర‌చార క‌ర్తల‌తో చిత్రాలు రూపొందించి ప‌బ్లిసిటీ చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ది. టూరిజంకు కొత్త పుంత‌లు తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో భాగంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొత్త‌గా బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌ను నియ‌మించడానికి నిర్ణ‌యించింది.

అందుకోసం యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో పాటు స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్టీయార్‌కు అత్యంత స‌న్నిహితుడైన కొడాలి నానితో ఆయ‌న మామ‌గారైన నార్నె శ్రీ‌నివాస‌రావు కూడా ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు. వారిద్ద‌రి అభ్య‌ర్థ‌న మేర‌కు జ‌గ‌న్ ఆ దిశ‌గా ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు స‌మాచారం. రాష్ర్ట వ్యాప్తంగా పురాత‌న క‌ట్ట‌డాలు, ఆల‌యాలు, ప‌ర్యాట‌క స్థ‌లాలు, అత్యంత రెండో పెద్ద‌దైన తీర రేఖ వంటి వ‌న‌రుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నారు. రాష్ర్టం అభివ్రుద్ధి చెందాలంటే ప‌ర్యాట‌కంతో వ‌చ్చే ఆదాయ వ‌న‌రుల‌తోనే సాధ్య‌మ‌ని భావించి ఆ పనిని శ్రీ‌కారం చుట్టారు.

ఈ క్ర‌మంలోనే యంగ్ డైన‌మిక్ హీరో, యువ‌త‌కు రోల్‌మోడ‌ల్‌గా ఉన్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను వాడుకుంటే ప్ర‌యోజ‌నం నెర‌వేరుతుంద‌ని భావిస్తున్న‌ట్టున్నారు. అలాగే, ష‌ట్ల‌ర్ సింధూ కూడా పిన్న వ‌య‌స్సులోనే అసాధార‌ణ విజ‌యాలు త‌న ఖాతాలో వేసుకుని యువ‌త‌కు రోల్‌మోడ‌ల్ అయ్యారు. ఆమె నియామ‌కం ద్వారా ఇత‌ర రాష్ర్టాల‌తో పాటు విదేశాల నుంచి కూడా ప‌ర్యాట‌కు తాకిడి పెరిగే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్న‌ట్టు భావిస్తున్న జ‌గ‌న్ స‌ర్కార్ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మొత్తంగా ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎన్టీయార్ లేదా సింధూలు ఎంపిక‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

A.P బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా జూనియ‌ర్‌..?
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Share
Share