పవన్ కల్యాణ్ కలలు కుప్ప కూలుతాయా?

September 7, 2018 at 2:20 pm

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కు సారథ్యం వహించి.. తెలంగాణలో కూడా అంతో ఇంతో తమ పార్టీ బతికే ఉన్నదని నిరూపించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కన్న కలలు కల్లలు కాబోతున్నాయా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. సీపీఐతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది ఎలా సాధ్యం అవుతుందో… ఏపీలో తెలుగుదేశంతో తీవ్రంగా పోరాడుతున్న జనసేన.. ఆ ఫ్రంట్ లోకి ఎలా ఇముడుతుందో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.Pawan Kalyan_Karimnagar_JSP_Facebook

ఏపీలో చంద్రబాబు నాయుడు వైఫల్యాలు రెచ్చగొడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి గనుక.. అక్కడ కాస్త కష్టపడితే.. ఫలితం ఉంటుందనే ఆశ పుడుతున్నది గనుక.. పవన్ కల్యాణ్ అక్కడ తన రాజకీయా పోరాట యాత్రలు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో.. ఇటు తెలంగాణలో మాత్రం కనీసం పార్టీ కమిటీల గురించి కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తే ఏకంగా ఎన్నికలు ముంచుకు వచ్చేస్తున్నాయి.2018_4$largeimg19_Apr_2018_123800280

ఆ రకంగా పవన్ కల్యాణ్ ఎంతగా వెనుకబడి ఉన్నప్పటికీ.. ఆయన అంతో ఇంతో కాసిని ఓట్లు రాబట్టే బలం ఉన్నది గనుక ఆయన ప్రాపకం సంపాదించడానికి ఒకవైపు సీపీఎం నానా ప్రయత్నాలు చేసుకుంటున్నది. కానీ పవన్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈలోకా ఎన్నికలొచ్చేస్తున్నందున ప్రతిపక్షాలు కూటములకు స్పీడ్ అప్ అవుతున్నాయి. తెలుగుదేశం సీపీఐ, టీజేఎస్, సీపీఎంలతో పొత్తు గురించి ఆలోచిస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది.1_4

నిజానికి తమ్మినేని వీరభద్రం నుంచి ప్రతిపాదన వచ్చినప్పుడు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కుసారథ్యం వహించడానికి పవన్ కాస్త టెంప్ట్ అయినట్లుగా కొందరు చెబుతున్నారు. తనకు శ్రమ లేకుండా క్రెడిట్ వస్తుందని ఆశపడ్డారు. కానీ.. ఇప్పుడు అలాంటి కూటమిలో తెలుగుదేశం కూడా ఉండేట్లయితే పవన్ ఖచ్చితంగా అందులో చేరరు.. అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పైగా, తెదేపా వచ్చినా రాకపోయినా.. బహుజన ఫ్రంట్ వల్ల తమకేమీ లాభం లేదని.. అయితే గియితే సీపీఎంకు కాస్త లాభం ఉండొచ్చునని.. అందుకోసం తాము ఇప్పటికిప్పుడు కేసీఆర్ తో వ్యతిరేకత ను ఎందుకు కొనితెచ్చుకోవాలని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరి తెలంగాణలో ఈ విడత శాసనసభ ఎన్నికల్లో కూడా పవన్ కల్యాణ్ కనిపించబోరని అర్థమవుతోంది.

పవన్ కల్యాణ్ కలలు కుప్ప కూలుతాయా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share