రోజా విష‌యంలో జ‌గ‌న్ టెన్ష‌న్ టెన్ష‌న్‌..!

June 10, 2019 at 12:14 pm

జ‌బ‌ర్ద‌స్త్ రోజా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వెండితెర, బుల్లితెర‌ల‌పై ఏవిధంగా ఓ వెలుగు వెలిగిందో.. రాజ‌కీయాల్లో నూ ఆమె అలానే వెలుగుతోంది. విప‌క్షంలో ఉన్న‌స‌మ‌యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సాధించింది. వ‌రుస విజ‌యాల తో దూసుకుపోతున్న రోజా.. చిత్తూరు జిల్లా న‌గ‌రి నుంచి రెండో ద‌ఫా విజ‌యం సాధించారు. పార్టీని ముందుకు న‌డిపించ డంలోను, ఉద్ధండుడైన టీడీపీ నాయ‌కుడు గాలి ముద్దుకృష్ణ‌ను ఓడించ‌డంలోను, ఆ త‌ర్వాత ఆయ‌న త‌నయుడు భాను ప్ర‌కాశ్‌ను ఓడించ‌డంలోను రోజా కీల‌కంగా ముందుకు సాగారు. ఇక‌, పార్టీ కోసం ఆమె తీవ్రంగా శ్ర‌మించారు.

వైసీపీ అధినే త జ‌గ‌న్‌కు అధికారం ద‌క్కాల‌నే కాంక్ష‌తో పాద‌యాత్ర కూడా చేశారు. ఇలా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఏర్ప‌డిన మంత్రి వ‌ర్గంలో రోజా బెర్త్‌ను ఆశించారు. ఆ మాట‌కొస్తే.. రోజాకు బెర్త్ ఖాయ‌మ‌నే మాట ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక‌, జ‌గ‌న్ అధికారంలోకి రాబోతున్నాడ‌ని తెలిసిన వెంట‌నే తెర‌మీద‌కు వ‌చ్చింది. హోం మంత్రి ప‌ద‌వి అంటూ… సోష‌ల్ మీడియా తెగ ప్ర‌చారం చేసింది. తీరా కేబినెట్ కూర్పులో ఎక్క‌డా రోజా పేరు క‌నిపించ‌క‌పోయే స‌రికి రోజా హ‌ర్ట్ అయ్యారు. సీఎల్పీ మీటింగ్‌కు ఎంతో ఉత్సాహంగా, ఉర‌క‌లెత్తే ఆనందంతో వ‌చ్చిన రోజా.. మీటింగ్ ముసిన వెంట‌నే మీడియాతో మాట్లాడుతూ.. కూడా త‌న‌కు కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మ‌నే ఆశాభావాన్ని న‌ర్మ‌గ‌ర్భంగా చెప్పుకొచ్చారు.

జ‌గ‌న్ ఏ బాధ్య‌త ఇచ్చినా చేస్తాన‌ని చెప్పారు. దీంతో కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. తీరా.. కేబినెట్ కూర్పులో జ‌గ‌న్‌.. రోజాకు ఛాన్స్ ఇవ్వ‌లేక పోయారు. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వెనువెంట‌నే పార్టీ కార్యాల‌యం నుంచి రోజా వెళ్లిపోయారు. క‌నీసం మంత్రి వ‌ర్గ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి కూడా రాలేదు. ఈ నేప‌థ్యంలో విష‌యం తెలుసుకున్న జ‌గ‌న్ ఆమెకు మంత్రి వ‌ర్గంలో కాక‌పోయినా.. స్వ‌తంత్రంగా నిర్ణ‌యాలు తీసుకునే, కేబినెట్ హోదా ఉన్న ప‌ద‌విని ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలో ఆర్టీసీ చైర్మ‌న్ లేదా మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వుల్లో ఒక‌టి ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం అయితే, ఆర్టీసీని ఏకంగా ప్ర‌భుత్వంలోనే విలీనం చేస్తుండ‌డం, మ‌హిళా క‌మిష‌న్ అంటే పార్టీల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితి ఉండ‌డంతో ఏం చేయాల‌నే విష‌యంపై జ‌గ‌న్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనా.. `ఎవ‌రికీ అన్యాయం చేయ‌ను`- అన్న జ‌గ‌న్ రోజాకు న్యాయం చేసే దిశ‌గానే అడుగులు వేస్తుండ‌డం మాత్రం గ‌మ‌నార్హం.

రోజా విష‌యంలో జ‌గ‌న్ టెన్ష‌న్ టెన్ష‌న్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share