ఓట్ల తొల‌గింపు బాబు ప‌నే..

March 14, 2019 at 1:11 pm

గెల‌వ‌డానికి ఎంచుకున్న మార్గం ఓట్ల తొల‌గింపు.. ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక‌త ఎక్కువైంద‌న్న విష‌యాన్ని గ‌మ‌నించిన చంద్ర‌బాబు ప‌క్కాగా ప్ర‌ణాళిక రూపొందించారు. జ‌గ‌న్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆద‌ర‌ణ చూసి ఎలాగైనా మ‌ళ్లీ గెల‌వాలంటే ఏం చేయాల‌నే ఆలోచ‌న‌లో ప‌డి మ‌రీ బ‌రితెగించే ప‌నికి శ్రీ‌కారం చుట్టారు. అనుకున్న‌దే త‌డ‌వుగా వైసీపీకి అనుకూలంగా ఉన్న రాష్ర్టంలోని నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌త్యేక ద్రుష్టి సారించేందుకు యంత్రాంగాన్ని పుర‌మాయించారు. ఆయా ప్రాంతాల్లో ఓట‌ర్ల జాబితాల‌ను సేక‌రించి వైసీపీకి అనుకూలుర ఓట్లు తొల‌గిపోయేలా త‌న వారితోనే ఎడాపెడా దొంగ ఓట్లు చేరాలా చేశారు.

ఎక్క‌డా ఎవ‌రికి అనుమానం రాకుండా చేసిన‌ప్ప‌టికీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ బ‌య‌ట‌పెట్టిన లెక్క‌ల‌తో బాబు బాగోతం బ‌య‌ట‌ప‌డింది. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో ఓట్ల ప‌ర్సంటేజీ పెరిగిపోతే కేవ‌లం ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రమే సుమారు ఐదు ల‌క్ష‌ల ఓట్లు త‌గ్గ‌డంతో అస‌లు విష‌యాలు బ‌యట‌ప‌డ్డాయి. ఈసీ 2014 నుంచి 2018 వ‌ర‌కు ఓట్ల సంఖ్య‌ను బ‌య‌ట‌పెట్ట‌డంతో చంద్ర‌బాబు స‌ర్కార్ చేసిన దొంగ‌త‌నం బ‌ట్ట‌బ‌య‌లైంది. బాబు ప్ర‌భుత్వం జ‌గ‌న్ పార్టీకి అనుకూలంగా, మ‌ద్ద‌తుగా నిలిచే వారి ఓట్ల‌నే తొల‌గించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌వ‌డంతో అస‌లు నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. రాష్ర్ట జ‌నాభా లెక్క‌లు చూస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మే విష‌యాలు తెలిశాయి.

2015 నాటికి సుమారు ఐదుకోట్ల 13 ల‌క్ష‌ల జ‌నాభా ఉంటే, అది 2018 నాటికి ఐదు కోట్ల మూప్పై పైచిలుకు పెరిగింది. ఈ లెక్క‌న చూసినా కేవ‌లం యువ ఓట‌ర్ల సంఖ్యే దాదాపు ప‌దిహేడు ప‌ద్దెనిమిది ల‌క్ష‌ల మంది జ‌నాభా పెరిగితే ఎంత మంది ఓట‌ర్ల సంఖ్య పెర‌గాలో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. 2009-14 మ‌ధ్య కాలంలో సీమాంధ్ర జిల్లాల్లో దాదాపు 30 ల‌క్ష‌ల కొత్త ఓట‌ర్లు న‌మోదైతే ఆ త‌ర్వాత మాత్రం ఓట‌ర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతూ వ‌చ్చింది. అంటే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌క్కా స్కెచ్ ప్ర‌కార‌మే జ‌గ‌న్‌కు ప‌ట్టం ద‌క్క‌కుండా త‌నే మ‌ళ్లీ సీటు ద‌క్కించుకోవాల‌ని కుట్ర ప‌న్ని ఓట్ల తొల‌గింపు డ్రామాకు తెర‌లేపాడు. ఇప్పుడు ఈసీ చ‌ర్య‌ల‌తో అన‌వ‌స‌రంగా ఇరుక్కున్నారు.

ఓట్ల తొల‌గింపు బాబు ప‌నే..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share