‘జగన్-పవన్’ ఈ టైంలో కలిస్తే ఏంటి పరిస్థితి!

November 1, 2018 at 11:12 am

ఏపీలో రాజ‌కీయాలు అనూహ్య మ‌లుపులు తిరుగుతున్నాయి. ఒకే మాట‌, ఒకే బాట‌గా.. జ‌న‌మే బ‌లంగా వైసీపీ ముందుకు వెళ్తుండ‌గా.. ప‌లు పార్టీలు మాత్రం గింగిరాలు కొడుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో క‌లిసి న‌డిచిన టీడీపీ-బీజేపీల బంధం ముక్క‌లు కాగా, అప్ప‌ట్లో ఆ బంధానికి వంత‌పాడిన జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ ఇప్పుడు సొంతంగా రంగంలోకి దిగుతున్నాడు. ఇప్పుడు ఏపీలో ఎటు చూసినా.. జ‌న‌నేత జ‌గ‌న్‌కే ప్ర‌జ‌లు జై కొడుతున్న వేళ‌.. ఏం చేయాలో తెలియ‌క‌ టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ గురించి మాత్రం నాలుగు ముక్క‌లు ఎక్కువ‌గానే చెప్పుకోవాలి.

45091026_706395186426426_8167999908238852096_o

ఇన్నిరోజులూ వామ‌ప‌క్షాల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన ప‌వ‌న్ ఒక్క‌సారిగా ప్లేట్ ఫిరాయించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతామ‌ని, ఎవ‌రితోనూ పొత్తులు ఉండ‌వ‌ని ప‌వ‌న్ స్పష్టం చేశారు. పాపం.. ఇన్నిరోజులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఎర్ర‌న్న‌ల‌కు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చాడు. అయితే.. ఇప్పుడు కొత్త‌ముచ్చ‌ట ఒక‌టి వినిపిస్తోంది. అదేమిటంటే.. ప‌వ‌న్ మ‌రో పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో ఒంట‌రిగా దిగితే.. ఇక అంతే సంగ‌తులు.. అని గ్ర‌హించిన జ‌న‌సేనాని త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఇక ఆ పార్టీతో క‌ల‌సి న‌డిస్తేనే క‌ల‌దు సుఖం.. అన్న భావ‌న‌లో ఉన్నాడ‌ట‌. ఈ మేర‌కు రాయ‌బారం కూడా న‌డిచిన‌ట్లు తెలుస్తోంది.

Jagan-Mohan-Reddy_d

ఇంత‌కీ ఆ పార్టీ మ‌రేదో కాదు.. ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌జ‌ల మ‌న‌స్సు గెలుచుకున్న ఏకైక పార్టీ వైసీపీ. టీడీపీ అధినేత‌, ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కుట్ర‌ల‌ను ఛేదించుకుంటూ ఏడాది కాలంగా జ‌నంతో జ‌గ‌న్ మ‌మేకం అవుతున్నారు. ఇక మొన్న జ‌గ‌న్‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నంతో టీడీపీపై ప్ర‌జలు దుమ్మెత్తిపోస్తున్నారు. బాబు కుట్ర‌ల‌ను తిట్టిపోస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఏపీలో వార్ వ‌న్‌సైడ్‌గానే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం చంద్ర‌బాబును ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన‌ను కూడా జ‌నం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఉత్త‌రాంధ్ర‌కు సంబంధించి కేవ‌లం సొంత సామాజిక‌వ‌ర్గం మాత్రం కొంత మ‌ద్ద‌తుగా నిలిచే అవ‌కాకాశాలు క‌నిపిస్తున్నాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎలాగైనా.. వైసీపీతో క‌లిసి న‌డిస్తేనే ఉనికి ద‌క్కుతుంద‌న్న అంచ‌నాకు ప‌వ‌న్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ఆ పార్టీ త‌రుపు చిరంజీవి రాయ‌బారం న‌డుతున్న‌ట్లు స‌మాచారం. ఇక వైసీపీ నుంచి బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌తో సంప్ర‌దింపులు కూడా న‌డిచిన‌ట్లు తెలుస్తోంది. నిజానికి.. ఈ విష‌యాలేవీ.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌దాకా వెళ్ల‌న‌ట్లు స‌మాచారం. ఒక ఆయ‌న దాకా వెళ్తే.. ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది అంద‌రిలో ఆస‌క్తిని రేపుతోంది. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే.. జ‌న‌సేన‌ను ఒక పార్టీగా కూడా గుర్తించ‌ని జ‌గ‌న్ ప‌వ‌న్‌తో దోస్తీ చేస్తారో లేదో చూడాలి మ‌రి.

‘జగన్-పవన్’ ఈ టైంలో కలిస్తే ఏంటి పరిస్థితి!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share