రాజ‌కీయాల్లో వైఎస్సార్‌ది సువ‌ర్ణ అధ్య‌యం..

July 8, 2018 at 5:51 pm

రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆయ‌న‌ది సువ‌ర్ణ అధ్య‌యం.. కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీకి త‌న పాద‌యాత్ర‌తో ప్రాణ‌ప్ర‌తిష్ట చేసిన నేత‌.. ఆయ‌న వేసిన ప్ర‌తీ అడుగు బ‌డుగుల సంక్షేమం కోసమే.. ఆయ‌న శ్వాస విద్యార్థిలోకంలో చ‌దువుకుంటామ‌న్న‌ విశ్వాసాన్ని నింపింది.. వైద్యం అంద‌క రందిప‌డుతున్న మందికి కార్పొరేట్ వైద్యాన్ని అందించిన‌ ఆప‌ద్బాంధ‌వుడు.. అంత‌టి మ‌హానేత మ‌న‌మ‌ధ్య‌న లేడ‌న్న వార్త‌తో ఎన్నో గుండెలు ఆగిపోయాయి.. మ‌న‌సున్న మారాజు లేడ‌ని మ‌రెన్నో హ‌`ద‌యాలు ఎక్కిఎక్కి ఏడ్చాయి.. ఆ ప్ర‌జా నాయ‌కుడే.. దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి.. నేడు ఆయ‌న జ‌యంతి.. నేడు ఆయ‌న ఎన్నో గుండెల్లో శ్వాస‌గా నిలిచాడు.. మ‌రెన్నో ఇళ్ల‌లో దేవుడిలా పూజ‌లందుకుంటున్నాడు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జాజీవితాన్ని ఈ క‌థ‌న‌లో స్మ‌రించుకుందాం..

వైఎస్సార్ రాజ‌కీయ ప్ర‌స్థానం తిరుగులేనిది. ఓట‌మెరుగుని నేత‌గా ఎదిగారు. అసెంబ్లీకి పోటీ చేసినా.. పార్ల‌మెంటు స్థానం నుంచి బ‌రిలోకి దిగినా ఆయ‌నకు ఎదురు లేదు. 1978లో పులివెందుల నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా వైఎస్సార్‌ ఎన్నిక‌య్యారు. 1983, 1985 ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా గెలుపొందారు. 1989 ఎన్నిక‌ల్లో క‌డ‌ప లోక్ స‌భ స్థానానికి పోటీ విజ‌యం సాధించారు. మ‌రో మూడుసార్లు కూడా ఆయ‌న‌ ఎంపీ అయ్యారు. ఇలా , మూడు ద‌శాబ్దాల‌పాటు ఓట‌మి ఎరుగ‌ని నేత‌గా గుర్తింపు పొందారు. అయితే.. ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అప్ప‌టికి ఉన్న నేత‌ల్లో వైఎస్సార్ చిన్న‌వాడు కావ‌డం.. ప్ర‌జాక్షేత్రంలో చ‌క‌చ‌కా దూసుకుపోవ‌డంతో కొంద‌రు నేత‌లు జీర్ణించుకోలేక‌పోయారు. అంతేగాకుండా.. చిన్న‌వ‌య‌స్సులోనే ఏపీపీసీసీ చీఫ్ గా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టం గ‌మ‌నార్హం.

అప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ ప‌దేళ్ల‌పాటు అధికారానికి దూర‌మైంది. రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది.. ఇక్క‌డే వైఎస్సార్ తీసుకున్న నిర్ణ‌యం రాజ‌కీయ ముఖచిత్రాన్ని మార్చివేసింది. ఢిల్లీ పెద్ద‌ల వ‌ద్ద సాగిల‌ప‌డే త‌త్వానికి వైఎస్సార్ చ‌ర‌మ‌గీతం పాడారు. 2003లో రాష్ట్రంలో ఆయ‌న పాద‌యాత్ర మొద‌లుపెట్టారు. మండుటెండ‌ల్లో ఆయ‌న యాత్ర‌పై పార్టీలో కొంద‌రు పెద్ద‌లు పెద‌వి విరిచినా.. ప్ర‌జ‌లు మాత్రం జేజేలు ప‌లికారు. చంద్ర‌బాబు పాల‌న నుంచి త‌మ‌కు విముక్తి కల్పించే నాయ‌కుడొస్తున్నాడంటూ..అడుగ‌డుగునా ఆయ‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌నతో క‌లిసి కిలోమీట‌ర్ల కొద్దీ న‌డిచిన సామాన్యులెంద‌రో. నిజానికి అప్పుడు వైఎస్సార్ పీసీపీ చీఫ్‌గా కూడా లేరు. సీఎల్సీ నేత‌గానే ఆయ‌న పాద‌యాత్ర చేప‌ట్టారు. యాత్ర నుంచి తాను ఎంతో నేర్చుకున్నాన‌నీ స్వ‌యంగా ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఆయ‌న పాద‌యాత్ర ఫ‌లించింది. 2004ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తిరుగులేని విజ‌యం సాధించింది. అప్పుడు పెద‌వివిరిచిన నేత‌లంద‌రూ వైఎస్‌తో క‌లిసిరాక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత వైఎస్సార్ సంక్షేమ‌రంగానికి పెద్ద‌పీట వేశారు. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ఫ‌లాలు అందేలా చూశారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ప్ర‌భుత్వ విద్యారంగం దెబ్బ‌తిని పేద‌లు చ‌దువుకోలేని స్థితి. దీనిని వారిని బ‌య‌ట‌ప‌డేసేందుకు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి కార్పొరేట్ స్థాయి విద్య‌ను అందుబాటులోకి తెచ్చారు. అలాగే.. ఆరోగ్య‌శ్రీ‌తో కార్పొరేట్ వైద్యాన్ని పేద‌ల‌కు అందుబాటులోకి తెచ్చారు.. ఇలా ఆయ‌న నాడు ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు నేటికీ కొన‌సాగుతున్నాయి.. ఇప్పుడు భౌగోళికంగా రాష్ట్రం విడిపోయినా.. పాల‌కులు మారినా వైఎస్‌ ప‌థ‌కాల ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయి.

రాజ‌కీయాల్లో వైఎస్సార్‌ది సువ‌ర్ణ అధ్య‌యం..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share