వైసీపీకి ఊపు తెస్తున్న కొత్త చేరికలు

August 13, 2018 at 9:08 am

ఏపీలో రాజ‌కీయాలు ఆస‌క్తినిరేపుతున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ చేరిక‌ల్లో కొత్త రాగం వినిపిస్తోంది. సాధార‌ణంగా.. నాయ‌కుల కంటే ద్వితీయ‌, త‌`తీయ శ్రేణి క్యాడ‌ర్ క‌ద‌లిక‌ల ఆధారంగానే ఆయా పార్టీల గెలుపు అవ‌కాశాలు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటుంటారు. నాయ‌కుడు ఇత‌ర పార్టీలోకి జంప్ అయినంత మాత్రాన‌.. ఆయ‌న వెంటే క్యాడ‌ర్ పోతుంద‌నుకుంటే పొర‌పాటే. న‌మ్ముకున్నవాళ్ల‌ను న‌ట్టేట ముంచి స్వార్థం కోసం ఇత‌ర పార్టీల్లోకి దూకేసే నేత‌లెంద‌రో ఉన్నారు. అయితే, ద్వితీయ‌, త‌`తీయ శ్రేణి క్యాడ‌ర్ ఎటువైపు మొగ్గుచూపుతే ఆ పార్టీకే గెలుపు అవ‌కాశాలు మెండుగా ఉంటాయ‌ని విశ్లేష‌కుల అంచ‌నా. అయితే,ఇప్పుడు ఏపీలోనూ ఈ శ్రేణి క్యాడ‌ర్ క‌ద‌లిక‌లు మొద‌లయ్యాయి. అదికూడా వైసీపీ వైపు ఆ క్యాడ‌ర్ క‌దులుతోంది. దీంతో ఏపీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది.

jagan_2

ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లో టీడీపీకి చెందిన ద్వితీయ‌, తృతీయ శ్రేణి క్యాడ‌ర్ ఎక్కువ‌గా వైసీపీ వైపు మొగ్గుచూపుతోంది. దీనిని రాజ‌కీయాల్లో ట్రెండింగ్ టైమ్ అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటారు. ఈ ట్రెండింగ్‌ను బ‌ట్టే ఆయా పార్టీల విజ‌యావ‌కాశాలు ఉంటాయ‌ని చెబుతున్నారు. అయితే, ఈ ద్వితీయ‌, త‌`తీయ శ్రేణి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైసీపీలోకి ఎక్కువ‌గా వ‌స్తున్నారు. ఈ ట్రెండింగ్ ఎక్కువ‌గా.. రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లోని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాలు, మండ‌లాలు, గ్రామాల్లో క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోవ‌డం.. వైసీపీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో టీడీపీలో వ‌ణుకు మొద‌లైంద‌నే టాక్ వినిపిస్తోంది. క్యాడ‌ర్ వైసీపీలోకి వెళ్తుండ‌డంతో నేత‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్పుడు టీడీపీ రెండు ర‌కాలుగా ప్ర‌తికూల ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత వైసీపీ నుంచి గెలిచిన ప‌లువురు ఎమ్మెల్యేల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టీడీపీలో చేర్చుకున్నారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నేత‌లు, వైసీపీ నుంచి బ‌రిలోకి దిగిన వాళ్లు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఎవ‌రికి ఇవ్వాల‌న్న దానిపై బాబు మ‌ల్ల‌గులాలు ప‌డుతున్నారు. ఒక‌రికి టికెట్ ఇస్తే మ‌రొక‌రు స‌హ‌క‌రించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇక మ‌రోవైపు పార్టీ ద్వితీయ‌, తృతీయ శ్రేణి క్యాడ‌ర్ వైసీపీవైపు చూస్తోంది. నమ్ముకున్న నాయ‌కుల ప‌నితీరు అధ్వానంగా ఉన్న‌ప్పుడే ప‌ట్ట‌ణ‌, మండ‌ల‌, గ్రామ నాయ‌కులు ఇత‌ర పార్టీల్లోకి వెళ్తుంటారు. ఇప్పుడే టీడీపీలో కూడా ఇదే జ‌రుగుతోంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలే గుస‌గుస‌లాడుకుంటున్నాయి. ముందుముందు ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

వైసీపీకి ఊపు తెస్తున్న కొత్త చేరికలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share