నెక్ట్స్ నువ్వే TJ రివ్యూ

టైటిల్‌: నెక్ట్స్ నువ్వే

జాన‌ర్‌: హ‌ర్ర‌ర్ + కామెడీ

న‌టీన‌టులు: ఆది, వైభ‌వి, ర‌ష్మీ, బ్ర‌హ్మాజీ

మ్యూజిక్‌: సాయి కార్తీక్‌

నిర్మాత‌: బన్నీ వాస్

ద‌ర్శ‌క‌త్వం: ప్రభాకర్

రిలీజ్ డేట్‌: 3 న‌వంబ‌ర్‌, 2017

బుల్లితెర సీరియ‌ల్స్‌లో కింగ్ అయిన ప్ర‌భాక‌ర్ తొలిసారిగా వెండితెర మీద ద‌ర్శ‌కుడిగా మెగాఫోన్ ప‌ట్టారు. బుల్లితెర‌మీద ప్ర‌భాక‌ర్ అంటే ఎంత పాపులారిటీ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో పాటు ఈ సినిమాను ఏకంగా నాలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ , బన్నీ వాస్ నిర్మించ‌డంతో పాటు ట్రైల‌ర్ కాస్త ఆస‌క్తి రేప‌డంతో స‌హ‌జంగానే నెక్ట్ నువ్వేపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. సాయి కుమార్ త‌న‌యుడు ఆది హీరోగా న‌టించ‌డం, హాట్ యాంక‌ర్ ర‌ష్మీ కూడా సినిమాలో ఉండ‌డంతో రిలీజ్‌కు ముందే బ‌జ్ అదిరింది. ఈ రోజు థియేట‌ర్ల‌లోకి దిగిన ఈ సినిమా హీరోగా ఆదికి హిట్ ఇచ్చిందా ? ద‌ర్శ‌కుడిగా ప్ర‌భాక‌ర్ స‌క్సెస్ అయ్యాడో ? లేదో ? చూద్దాం.

స్టోరీ :

కిరణ్ (ఆది) ఓ టీవీ సీరియల్ దర్శకుడు. మ‌నోడికి ఓ గ‌ర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. అయితే ఎంజాయ్ చేయ‌డానికి వీల్లేనంత‌గా అత‌డికి అప్పులు ఉంటాయి. కిర‌ణ్‌కు అప్పులు ఇచ్చిన గుండా జ‌య‌ప్ర‌కాశ్‌రెడ్డి టార్చ‌ర్ త‌ట్టుకోలేక సిటీ నుంచి పారిపోతాడు. అర‌కులో త‌న తండ్రికి ఉన్న పాత ఆస్తి గురించి తెలుసుకుని దానిని బాగు చేయడానికి జయప్రకాశ్ కొడుకు దగ్గరే మళ్లీ డబ్బు లాగుతాడు కిరణ్. దానిని రిసార్ట్స్‌గా మార్చి ఆ ఆదాయంతో అప్పులు తీర్చి సెటిల్ అయిపోవాల‌ని ప్లాన్ చేస్తాడు. అక్కడికి కిరణ్ తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ వైభవి, శరత్ ( బ్రహ్మాజీ ) , శరత్ సోదరి ( రష్మీ ) కలిసి వెళతారు. అయితే ఆ హోటల్‌కు వ‌చ్చిన గెస్టులు ఒక్కొక్క‌రిగా చ‌నిపోతూ ఉంటారు. దీంతో కిర‌ణ్‌తో పాటు వాళ్లంతా వ‌ణికిపోతారు. ఈ చావుల‌కు కార‌ణం క‌నుక్కోవాల‌ని కిర‌ణ్ చేసే ప్ర‌య‌త్నంలోనే అత‌డికి రిసార్ట్స్‌లో దెయ్యం ఉంద‌న్న నిజంతో పాటు మ‌రికొన్ని షాకింగ్ విష‌యాలు తెలుస్తాయి. మ‌రి కిర‌ణ్ అనుకున్న‌ట్టుగానే అక్క‌డ దెయ్యం ఉందా ? ఆ దెయ్యం అక్క‌డ ఎందుకు ఉంది ? చివ‌ర‌కు త‌న రిసార్ట్స్‌ను ఆ దెయ్యం భారీ నుంచి ఎలా కాపాడుకున్నాడు ? అన్న‌దే నెక్ట్స్ నువ్వే స్టోరీ.

TJ విశ్లేష‌ణ :

హీరో ఆది న‌ట‌న గ‌త సినిమాల‌తో పోలిస్తే కాస్త బెట‌ర్‌. హ‌ర్ర‌ర్ జాన‌ర్ కావ‌డంతో కొత్త అయినా బాగానే ట్రై చేశాడు. హీరోయిన్ వైభ‌వి అందచందాల‌తో పాటు న‌ట‌న‌లోను ఓకే అనిపించింది. ఇక బ్ర‌హ్మాజీ కామెడీ సినిమాకే మేజ‌ర్ హైలెట్‌. మిగిలిన వాళ్ల‌లో ర‌ఘుబాబు కూడా కామెడీ రోల్‌లో మెప్పించాడు. ర‌ష్మీ త‌న స్టైల్లోనే కుర్ర‌కారును రెచ్చ‌గొట్టేందుకు ట్రై చేసింది. షకీలా రోల్ చిన్నదే అయినా బాగుంది. ఇక సినిమా ఫస్టాఫ్‌లో ప్ర‌తి ఐదు నిమిషాల‌కు మంచి కామెడీ సీన్‌తో క‌థ‌ను న‌డిపించిన ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ బ్ర‌హ్మాజీ పాత్ర‌తో ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ట్రై చేశాడు. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు క‌థ‌నం మ‌రీ ఓహో అనిపించేలా లేక‌పోయినా ప‌ర్వాలేద‌నుకోవ‌చ్చు. ఎప్పుడైతే సెకండాఫ్ స్టార్ట్ అవుతుందో ప్రేక్ష‌కుడు అప్పుడే త‌ల‌లు ప‌ట్టుకోవ‌డం స్టార్ట్ చేస్తాడు. అసలు రిసార్ట్స్ లో దెయ్యం ఎందుకుంది, దాని కథేమిటి, దానికేం కావాలి, అతిథులందరినీ ఎందుకు చంపుతుందో ఎవ్వ‌రికి తెలియ‌దు. క్లైమాక్స్ మ‌రీ ఘోరం. దెయ్యం ప్లాష్‌బ్యాక్‌లో అయితే కొన్ని పాత్ర‌లు ఎందుకు వ‌స్తాయో ? ఎందుకు పోతాయో ? కూడా ఎవ్వ‌రికి తెలియ‌దు. సెకండాఫ్ ఓ నాటిక‌లా సాగ‌దీస్తూ ముందుకు క‌ద‌ల‌డంతో శుభం కార్డు ఎప్పుడు ప‌డుతుందా ? అని ప్రేక్ష‌కుడు ఎదురు చూస్తుంటాడు. మ‌రి విసిగిపోయిన వాళ్లు అయితే థియేట‌ర్ నుంచి ఎప్పుడు భ‌య‌ట‌పడ‌దామా ? అని త‌ల ప‌ట్టుకుంటాడు.

టెక్నిక‌ల్ & డైరెక్ష‌న్ క‌ట్స్ :

టెక్నిక‌ల్‌గా కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాగుంది. తీసింది కొని లొకేషన్లలోనే అయినా చక్కగా చేశాడు. సినిమా టెక్నిక‌ల్ విభాగాల్లో ఇదే హైలెట్. సాయి కార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్ల‌లో బాగుంది. న‌లుగురు నిర్మాత‌లు ఈ చిన్న సినిమాకు ఉన్నంత‌లో లోటు లేకుండా ఖ‌ర్చు చేశారు. ఇక ఎడిటింగ్ విష‌యానికి వ‌స్తే ఓ 30 నిమిషాల సీన్ల‌ను సులువుగానే ట్రిమ్ చేసేయొచ్చు. దీనిని బ‌ట్టి ఎడిట‌ర్ తన ప‌నికి ఎంత న్యాయం చేశాడో తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ తొలి సినిమాకు హ‌ర్ర‌ర్ జాన‌ర్ ఎంచుకోవ‌డం మంచిదే అయినా దానికి త‌గిన బ‌ల‌మైన క‌థ‌, క‌థ‌నాలు రాసుకోవ‌డంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. స్క్రిఫ్ట్‌, డైలాగులు పేల‌వంగా ఉన్నాయి.

ప్ల‌స్‌లు:

ప్ల‌స్‌ల్లో సినిమాటోగ్ర‌ఫీ, సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, నిర్మాణ విలువ‌లు

మైన‌స్‌లు:

మైన‌స్‌ల లెక్క చాలానే ఉంది…..

TJ ఫైన‌ల్ పంచ్‌: నెక్ట్ నువ్వే టీం నెక్ట్ టైం బెట‌ర్ ల‌క్‌

TJ సూచ‌న‌: నెక్ట్ నువ్వే వ‌ద్దు నెక్ట్స్ మూవీ ముద్దు

TJ నెక్ట్ నువ్వే మూవీ రేటింగ్‌: 2 / 5