కాంగ్రెసోళ్ళకి వైఎస్సార్‌ గుర్తుకొచ్చిండు 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని నేడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు చాలా గట్టిగా స్మరించుకున్నారు. దివంగత నేత, సమైక్య తెలుగు రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. పరిపాలనలో వివాదాలు ఎలా ఉన్నా అనేక పథకాలతో ప్రజల నాడిని పట్టుకున్నారు రాజశేఖర్‌రెడ్డి. స్వతహాగా డాక్టర్‌ కావడంతో పేదవారు ఆరోగ్యం కోసం పడ్తున్న పాట్లు చూసి చలించిపోయారు. 108 అంబులెన్స్‌ సర్వీసులు, ఆరోగ్యశ్రీ వంటి పథకాల్ని వైఎస్సార్‌ ప్రవేశపెట్టింది పేదల కోసమే. ఆ పేదలు ఇప్పటికీ ఎప్పటికీ రాజశేఖర్‌రెడ్డి పేరు చెప్పుకుంటూనే ఉంటారు.

ఇంకోవైపున రాజశేఖర్‌రెడ్డి అనే ఇమేజ్‌ని కాంగ్రెసు పార్టీ దూరం చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో. తద్వారా రాజకీయంగా దెబ్బతినాల్సి వచ్చింది. వైఎస్‌ఆర్‌ని అలాగే ఆయన కుమారుడిని అవినీతిపరుడిగా కాంగ్రెసు నాయకులు చిత్రీకరించారు. చివరికి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు గుర్తుగా అన్నట్టు YS పేరును FIR లో చేర్చి ఆ మహనీయయుడిని అవమానపరిచారు.ఫలితం అనుభవిచారు,ఇంకా అనుభవిస్తూనే వున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.

ఏదేమైనా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలుగు రాజకీయాల్లో ఓ మహా శక్తి. మహనీయుడిగా ఆయన్ని అందరూ స్మరించుకుంటారు. షబ్బీర్‌ అలీ సహా తెలంగాణలో పలువురు కాంగ్రెసు ముఖ్య నాయకులు వైఎస్సార్‌ని స్మరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొందరు కాంగ్రెసు నాయకులు వైఎస్‌ చేసిన సేవల్ని కొనియాడారు. YS పై నిందలు మోపినప్పుడు దగ్గురుండి చోద్యం చూసిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వాళ అదే YS ఇమేజ్ తమ పార్టీకి తిరిగి రావాలని ఇలా మొక్కుబడి కార్యక్రమాలు చేస్తుందన్నది జగమెరిగిన సత్యం.

కాగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ, వైఎస్‌ఆర్‌ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి.