‘ బుర్ర‌క‌థ ‘ ట్రైల‌ర్‌…ప్ర‌తి కుర్రాడి జీవితంలో ఓ ఆంటీ

June 24, 2019 at 11:37 am

డైలాగ్ కింగ్‌సాయికుమార్ త‌న‌యుడు ఆది వ‌రుస‌గా ప్లాపుల మీద ప్లాపులు ఇస్తూనే ఉన్నాడు. కొంత కాలంగా హిట్లు లేక‌పోవ‌డంతో గ్యాప్ తీసుకున్న ఆది ఇప్పుడు బుర్ర‌క‌థ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.
తాజాగా సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. 2.04 నిమిషాల ఉన్న ట్రైల‌ర్‌లో క‌థ మ‌రీ కొత్త‌గా ఉన్న‌ట్టు లేదు. ఆది అభి, రామ్ అనే రెండు క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపిస్తున్నాడ‌ని స్ప‌ష్ట‌మైంది.

ఆది త‌న విల‌న్‌ను ఉద్దేశించి రామాయ‌ణంలో రాముడు శ‌త్రువు రావ‌ణాసురుడు… కృష్ణుడు శ‌త్రువు కంసుడు… నా శ‌త్రువు నాతోనే ఉన్నాడు అని చెప్పే డైలాగ్‌ను బ‌ట్టి హీరో ప‌క్క‌నే విల‌న్ కూడా ఉండేలా ద‌ర్శ‌కుడు క్యారెక్ట‌ర్ డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. స్వాతి బుక్‌మీద ప్ర‌మాణం చేసి చెపుతున్నాను… ప్ర‌తి కుర్రాడి జీవితంలో ఒక ఆంటి ఉంటుంది… ఐ లైక్ ద‌ట్ ఆంటీ… 25 ఏళ్ల‌కు స‌న్నీలియోన్ కావాలికాని… స‌న్యాసం ఏంటి లాంటి డైలాగులు పిచ్చ కామెడీ పుట్టించాయి.

వాడు ఓ ర‌కంగా ఆలోచిస్తున్నాడు… వీడు ఓ ర‌కంగా ఆలోచిస్తున్నాడంటూ ఆది తండ్రి రాజేంద్ర‌ప్ర‌సాద్ బావోద్వేగానికి గురయ్యే సీన్‌లో సెంటిమెంట్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యేలా ఉంది. ఇక హీరోయిన్ మిస్త్రీ చ‌క్ర‌వ‌ర్తి (నితిన్ ఓ చిన్న‌దానం ఫేం) మ‌ద‌ర్ థెరిస్సా మీద చెప్పే డైలాగుతో ఆమెది స‌మాజ‌సేవ చేసే క్యారెక్ట‌ర్ అని తెలుస్తోంది. ఓవ‌రాల్‌గా కామెడీ, ఎమోష‌న్‌, ల‌వ్‌, విల‌న్ల‌తో పోరాటాలు ఇవ‌న్నీ రొటీన్‌గానే ఉన్నా ద‌ర్శ‌కుడు ర‌త్న‌బాబు ట్రీట్‌మెంట్ కొత్త‌గానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ట్రైల‌ర్‌తో ఆదికి హిట్ క‌ళ క‌న‌ప‌డుతోంది.

‘ బుర్ర‌క‌థ ‘ ట్రైల‌ర్‌…ప్ర‌తి కుర్రాడి జీవితంలో ఓ ఆంటీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share