‘ అజ్ఞాత‌వాసి ‘ ఫ‌స్ట్ షో ఎక్క‌డో తెలుసా

January 9, 2018 at 10:47 am

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న అజ్ఞాత‌వాసి హంగామా మొద‌లైపోయింది. ఈ సినిమా మ‌రికొన్ని గంటల్లోనే థియేట‌ర్ల‌లోకి దిగిపోనుంది. ఈ సినిమాకు తెలంగాణ‌లో ప్రీమియ‌ర్లు వేసుకునేందుకు ముందే అనుమ‌తి వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం కేసీఆర్‌ను క‌ల‌వ‌డంతో అజ్ఞాత‌వాసి ప్రీమియ‌ర్ల‌కు అనుమ‌తులు వ‌చ్చిన‌ట్టు టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే అధికారికంగా మాత్రం తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి ఇంకా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ఇక ఏపీలో మాత్రం ఈ సినిమాకు మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచే ప్రీమియ‌ర్ల హ‌డావిడి మొద‌లు కానుంది. అజ్ఞ‌త‌వాసికి రోజుకు ఏడు షోలు వేసుకునేందుకు ప్ర‌భుత్వం అధికారికంగా అనుమ‌తి ఇచ్చింది. చంద్ర‌బాబు ఈ మేర‌కు ఈ ఫైలు మీద సంత‌కం కూడా చేసేశారు. దీంతో ఏపీ అంతటా మంగ‌ళ‌వారం అర్ధ రాత్రి నుండి అజ్ఞాతవాసి హంగామా మొదలు కాబోతోంది. 

ఇక తెలంగాణ‌కు వ‌స్తే ఈ సినిమాకు కూడా అక్క‌డ ప్రీమియ‌ర్ల కోసం అనుమ‌తులు కోరారు. మంగ‌ళ‌వారం నాడు దీనికి అనుమ‌తులు వ‌స్తాయ‌ని అంటున్నారు. అనుమ‌తులు వ‌స్తే మంగ‌ళ‌వారం సెకండ్ షో నుంచే చాలా ప్రాంతాల్లో బాహుబ‌లి 2 సినిమాకు వేసిన‌ట్టుగా షోలు వేసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి వస్తే ఈ రోజు సెకండ్ షో నుంచే ఇక్క‌డ ముందు షోలు స్టార్ట్ కానున్నాయి. 

పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా కావ‌డంతో అజ్ఞాత‌వాసిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. తొలి రోజు ఈ సినిమా ఎంత గ్రాస్‌, ఎంత షేర్ క‌లెక్ట్ చేస్తుంద‌న్న దానిపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించారు. 

‘ అజ్ఞాత‌వాసి ‘ ఫ‌స్ట్ షో ఎక్క‌డో తెలుసా
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share