ప్రకటన : అఖిల్‌కు తోడు కావాలి..!

May 17, 2019 at 4:03 pm

అక్కినేని అఖిల్‌కు తోడు కావాల‌ట‌. తాను ఆడి పాడుకోవాలంటే ఓ తోడు కావాల‌ని అంటున్నాడు. ఇంత‌కు అఖిల్ వెతుకుతున్న తోడు నిజ జీవితంలో కాదండి… రీల్ జీవితంలోకి… అదేనండీ… అఖిల్ కొత్త‌గా న‌టించ‌బోతున్న సినిమాకు హీరోయిన్ కావాల‌ట‌. అఖిల్‌కు జోడి కోసం తెగ వెతుకుతున్నారు. జోడి దొరికితే వెంట‌నే సినిమాకు కొబ్బ‌రి కాయ కొట్టిడమే త‌రువాయి. అన్ని కుదురుతున్నాయి కానీ హీరోయిన్ విష‌య‌మే తేల‌డం లేద‌ట‌. అఖిల్‌కు జోడీ ఎప్పుడు దొరుకుతుందో కొబ్బ‌రి కాయ ఎప్పుడు కొడ‌తారో… సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళుతుందో న‌ని సినిమా యూనిట్ ఎదురుచూస్తుంది.

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబీనేష‌న్‌లో ఓ కొత్త సినిమాకు శ్రీ‌కారం చుట్టారు. ఇప్ప‌టికే క‌థ రెడి చేసి, స్క్రిప్ట్ సిద్దం చేసి సెట్స్‌పైకి తీసుకెళ్ళెందుకు స‌మాయ‌త్తం అయ్యారు. అయితే హీరోయిన్ విష‌యం తేల‌క‌పోవ‌డంతో ఇంత‌కాలం షూటింగ్‌ను ప్రారంభించలేదు. ఇక హీరోయిన్ లేకుండానే మిగ‌తా పార్టుల‌ను చిత్రించాల‌ని ద‌ర్శ‌కుడు నిర్ణ‌యించాడ‌ట‌. అందుకు త‌గిన విధంగా షూటింగ్‌ను ప్రారంభించాడు.

షూటింగ్‌ను ఈనెల 24న లాంచ‌నంగా ప్రారంభించి, వ‌చ్చే నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నార‌ట‌. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో హీరో, ఇత‌ర తార‌గ‌ణం పాల్గొనే భాగాల‌ను చిత్రికరించ‌నున్నారు. ఈ సినిమాలో ముందుగా కీర్తి సురేష్ పేరు అనుకున్న‌ప్ప‌టికి ఆమే హీరోక‌న్నా పెద్ద‌వ‌య‌స్సులో క‌నిపిస్తుంద‌నే సాకుతో వ‌ద్ద‌నుకున్నార‌ట‌. ఇక కియరా అద్వానీ, ర‌ష్మీక మందాన‌ల‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఈ సిన‌మాకు గోపిసుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు కాగా, గీతా ఆర్ట్స్ – 2 బ్యానర్‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు.

ప్రకటన : అఖిల్‌కు తోడు కావాలి..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share