బ‌న్నీ.. త్రివిక్ర‌మ్‌.. నో స్పెష‌ల్‌..!

March 28, 2019 at 11:39 am

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్ టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసి నేటికి 16ఏళ్లు పూర్త‌య్యాయి. అయితే.. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సినిమాకు సంబంధించి ఏదో ఒక విష‌యం చెబుతార‌ని అభిమానులంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురు చూశారు. కానీ.. ఇవేమీ లేకుండానే తుస్సుమ‌నిపించారు. అయితే.. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఫైన‌ల్ కాలేదు. కాక‌పోతే.. ఏడాది త‌ర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అల్లు అర్జున్‌ టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 16 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సినిమాకు సంబంధించి ఏదో ఒక స‌ర్‌ప్రైజ్ చెప్పాలంటూ హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థను ట్యాగ్స్‌ చేస్తూ రిక్వెస్ట్‌లు పంపారు అభిమానులు. ‘ఇంకా ఎన్నిరోజులు ఆగాలి..’ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు చెబుతారంటూ అభిమానులు అంటున్నారు. కానీ.. వారు కోరుకున్న‌ట్లుగా ఎలాంటి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌లేదు. సినిమాకు సంబంధించిన ఎలాంటి స‌మాచార‌మూ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు.

అయితే.. అభిమానుల ఎదురుచూపుల‌పై హారిక హాసిని క్రియేష‌న్స్ సంస్థ స్పందించింది. ‘మేం ప్రతిఒక్కరి ఫీలింగ్స్‌కు విలువిస్తాం. త్రివిక్రమ్‌-బన్నీ కాంబినేషన్‌ కోసం మీరు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో.. మేమూ అంతే ఎగ్జైటింగ్‌గా ఉన్నాం. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగాకే మీకు పూర్తి వివరాలు ప్రకటించగలుగుతాం. దయచేసి అప్పటివరకు ఓపిక పట్టండి. త్వరలో మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకొస్తాం’ అని సంస్థ‌ వెల్లడించింది.

బ‌న్నీ.. త్రివిక్ర‌మ్‌.. నో స్పెష‌ల్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share