అల్లు శిరీషపై నాని హాట్ కామెంట్స్

May 14, 2019 at 4:39 pm

అల్లు అర్జున్ సోద‌రుడు అల్లు శిరీష్ న‌టించిన ఏబీసీడీ సినిమా తో స్టార్‌గా ఏబిసీడీలు నేర్చుకోవాల‌ని నాచుర‌ల్ స్టార్ నానీ అన్నాడు. అల్లు శిరీష్ న‌టించిన ఏబిసీడీ సినిమా ఈనెల 17న విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించారు. ముఖ్య అతిధిగా హీరో నానీ పాల్గోని మాట్లాడారు. ఈ సినిమాతో అల్లు శిరీష్ స్టార్‌గా ఏబీసీడీలు ప్రారంభించాల‌ని సూచించాడు. అల్లు శిరీష్ లో చిన్న‌పిల్ల‌వాడి మ‌న‌స్త‌త్వం ఉంద‌ని అది ఎప్ప‌టికి అలాగే ఉండాల‌ని ఆకాంక్షించారు.

ఏబీసీడీ సినిమాను ద‌గ్గుబాటి సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోంది. ఈ సినిమాపై సురేష్‌బాబు, అల్లు శిరీష్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. ఈ టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తుంటే ఈ సినిమా విజ‌య‌వంతం అయి శిరీష్ కేరీర్‌లో ఓ మంచి సినిమాగా నిలుస్తుంద‌ని ప‌లువ‌రు ముఖ్య అతిధులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఏబీసీడీ టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన నానీ కి పిల్ల జ‌మీందార్ సినిమాను గుర్తు చేసుకున్నారు. పిల్ల జ‌మీందార్ సినిమా ఎలా ఉందో అంత‌క‌న్నా ఈ సినిమా బాగుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఏబీసీడీ సినిమా హీరో అల్లు శిరీష్ గురించి నానీ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. అల్లు శిరీష్ సినిమాల్లోకి రాక‌ముందు అనేక ర‌కాలైన ఆర్టిక‌ల్ రాసేవాడ‌న్నారు. శిరీష్ రాసే ఆర్టిక‌ల్స్ ఎంతో బాగుంటాయ‌ని అన్నాడు. చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వ‌మ‌ని అన‌డం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్న రుక్స‌ర్‌కు మంచి బ్రేక్ రావాల‌ని నానీ కోరుకుంటున్నాన‌ని అన్నాడు. కాగా నానీతో క‌లిసి రుక్స‌ర్ కృష్ణార్జున సినిమాలో న‌టించారు.

అల్లు శిరీషపై నాని హాట్ కామెంట్స్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share