హిజ్రాగా మెగాస్టార్ !

April 29, 2019 at 12:36 pm

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్ హిజ్రా పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు బాలీవుడ్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. తెలుగు, త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన కంచ‌న సినిమా గురించి తెలిసిందే. ఆ సినిమా సీక్వెల్స్ కూడా ఘ‌న విజ‌యం సాధించాయి. మొన్న‌టికి మొన్న విడుద‌లైన మూడో సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల పర్వం స్రుష్టిస్తోంది. డ్యాన్స్ మాస్ట‌ర్ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ న‌టించిన ఈ సినిమాలు మంచి ప్రేక్షకాద‌ర‌ణ‌తో దూసుకెళ్తున్నాయి. రెండు భాషల్లో సూప‌ర్ హిట్ టాక్‌ను ద‌క్కించుకున్నాయి.

లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించ‌నున్నారు. ఈ సినిమాకు ల‌క్ష్మి బాంబ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా, కాంచ‌న సినిమాలో ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్ పోషించిన హిజ్రా పాత్ర‌ను ఇప్పుడు బాలీవుడ్‌లో మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. సినిమాకు హీరోయిన్‌గా కియారా అద్వాని చేయ‌నున్నారు. సినిమాకు ప్ర‌త్యేక హైలైట్గా నిలిచేది మాత్రం హిజ్రా పాత్రే.

కాగా, అంత‌టి న‌టుడు అమితాబ్ హిజ్రా పాత్ర‌లో న‌టిస్తారో లేదో, అస‌లు ఆ ప్ర‌తిపాద‌నకు అంగీక‌రిస్తారో లేదో అనేది అనుమానంగా ఉంది. దీనికి సంబంధించిన అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాన‌ప్ప‌టికీ అంద‌రి ద్రుష్టి ఆ విష‌యంపైనే ప‌డింది. స‌రైన ప్ర‌క‌ట‌న వెలువ‌డే వ‌ర‌కు ఇలాంటి వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటాయి. అమితాబ్ బ‌చ్చ‌న్ ఎప్పుడూ చేయ‌ని పాత్ర‌కు మొగ్గు చూపుతారో లేదో చూడాలి మ‌రీ.

హిజ్రాగా మెగాస్టార్ !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share