బాలయ్య కోసం ఆగాల్సిన పని లేదు …బోయపాటి

May 3, 2019 at 3:02 pm

విన‌య విధేయ రామ చిత్రం భారీ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను తాజాగా.. త‌న పంథా మార్చుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం త‌న‌తో పెద్ద‌హీరోలెవ‌రూ సినిమా చేసేందుకు ముందుకు రాక‌పోవ‌డంతో.. ఓ కుర్ర‌హీరోతో సినిమా తీసేందుకు బోయ‌పాటి రెడీ అవుతున్న‌ట్లు ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. టాలీవుడ్‌కు మ‌ళ్లీ తానంటే ఏమిటో నిరూపించుకునేందుకు తీవ్ర క‌స‌ర‌త్తే చేస్తున్నాడు. ఈ మేర‌కు సైటెంట్‌గా త‌న‌ప‌ని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

నిజానికి… విన‌య విధేయ రామ సినిమా ఫెయిల్ అయినా కూడా హీరో బాల‌య్య‌బాబు బోయ‌పాటితో సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. కానీ.. క‌థ‌ను రెడీ చేయ‌డంలో బోయ‌పాటి కాస్తంత ఆల‌స్యం చేయ‌డంతో బాల‌య్య మ‌రో ద‌ర్శ‌కుడితో సినిమా ప్ర‌క‌టించారు. ద‌ర్శ‌కుడు కేఎస్ ర‌వికుమార్‌తో సినిమా చేస్తున్న‌ట్లు బాల‌య్య ప్ర‌క‌టించడంతో బోయ‌పాటి మ‌న‌స్తాపం చెందిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. దీని నుంచే ఆయ‌న త‌న పంథా మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఏ పెద్ద హీరోల కోసం ఆగాల్సిన ప‌నిలేద‌ని డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది.

త‌న కోసం ఆగ‌ని బాల‌య్య కోసం తాను ఆగాల్సిన ప‌నిలేద‌ని.. ఆయ‌న ఓకే అన్న‌ప్పుడే సినిమా చేస్తాన‌ని.. అప్ప‌టి వ‌ర‌కు ఖాళీగా కూర్చోవాల్సిన ప‌నిలేద‌ని డిసైడ్ అయిన బోయ‌పాటి ఓ కుర్ర‌హీరోతో మాస్‌మ‌సాలా సినిమా తీసేందుకు క‌థ‌ను రెడీ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఆ యువ హీరో ఎవ‌రన్న‌ది మాత్రం ఇంకా తెలియ‌దు. మొత్తానికి.. బాల‌య్య మ‌రో ద‌ర్శ‌కుడితో సినిమా చేసేందుకు రెడీ అవుతుండ‌గా.. బోయ‌పాటి వెయిట్ చేయ‌కుండా యువ హీరోతో సినిమా తీసేందుకు రెడీ అవుతుండ‌డంపై ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

బాలయ్య కోసం ఆగాల్సిన పని లేదు …బోయపాటి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share