బాలయ్య చెప్పాడు ..బోయపాటి పాటించాడు !

May 14, 2019 at 1:18 pm

హీరో బాల‌కృష్ణ డ‌బుల్ యాక్ష‌న్ రోల్‌ను విజ‌య‌వంతంగా పోషిస్తున్న విష‌యం తెలుగు ప్ర‌జ‌ల‌కు తెలిసిందే. అదేనండి అటు సినిమాల్లో హీరోగా విల‌న్ భ‌ర‌తం ప‌డుతున్నాడు బాల‌య్య‌. మ‌రోవైపు రాజ‌కీయ రంగంలోను ప్ర‌జాప్ర‌తినిధిగా ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్నాడు. హిందూపురం ఎమ్మెల్యేగా 2014 గెలిచిన బాల‌కృష్ణ ప్ర‌జాసేవ‌తో పాటు సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. రాజ‌కీయ రంగంలో దూసుకుపోతూనే మ‌రోవైపు సినిమాల్లో త‌న స‌త్తా చాటుతూనే ఉన్నాడు. బాల‌కృష్ణ అటు రాజ‌కీయం ఇటు సినిమా రంగంలో ద్విపాత్రాభిన‌యం చేస్తూనే అల‌రిస్తున్నారు.

రెండు రంగాల్లో పుల్ బిజీగా ఉన్న బాల‌కృష్ణ సినిమాల్లోనూ యాక్ష‌న్ చేయ‌బోతున్నారు. అదేనండి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రంలో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్లు సిని వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిఫ్ట్ వ‌ర్క‌ను బోయ‌పాటి శ్రీ‌ను పూర్తి చేసిన‌ట్లు తెలుగు చిత్ర‌సీమ‌లో ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇరువురి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమా పై బాల‌య్య అభిమానులు భారీ ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే బోయ‌పాటి శ్రీ‌ను ఇంత‌కుముందు బాల‌య్య‌కు ఓ క‌థ‌ను చూపిస్తే దాన్ని మార్పు చేయాల‌ని సూచించిన‌ట్లు తెలిసింది. బాల‌య్య సూచ‌న ప్ర‌కారం బోయ‌పాటి స్క్రిప్ట్ మార్చుకొగా బాల‌య్య దాన్ని ఓకే చేసిన‌ట్లు తెలిసింది. జూన్‌లో మొద‌లు పెట్టాల‌నుకున్న ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబ‌ర్ మాసంలో ప్రారంభించెందుకు స‌న్న‌హాలు చేస్తున్నార‌ట‌. ముందుకుగా అనుకున్న ప్ర‌కారం 60కోట్ల బ‌డ్జెట్‌తో సినిమా తీద్దామ‌నుకుని ప్లాన్ చేస్తే బాల‌య్య అడ్డుకున్న‌ట్లు సిని వ‌ర్గాల బోగ‌ట్టా. ఇప్పుడు మారిన ప‌రిస్థితుల్లో రూ.40కోట్ల బ‌డ్జెట్‌కు కుధించిన‌ట్లు తెల‌సింది. ఏదేమైనా బాల‌య్య – బోయ‌పాటి కాంబీనేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రం ఇది. హ్యాట్రిక్ హిట్ కొట్టాల‌ని బాల‌య్య అభిమానులు కోరుకుంటున్నారు.

బాలయ్య చెప్పాడు ..బోయపాటి పాటించాడు !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share