బాలయ్యకు విలన్ గా హీరోయిన్

May 10, 2019 at 12:36 pm

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం వెయిట్ చేస్తున్నారు. బాల‌కృష్ణ హిందూపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే బాల‌కృష్ణ త‌న నెక్ట్స్ సినిమాను కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో న‌టించ‌నున్నాడు. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబోలో జై సింహా సినిమా తెర‌కెక్కి హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్ ప్ర‌కారం ఈ సినిమాలో బాల‌కృష్ణ‌కు ధీటైన విల‌న్లుగా ఓ మేల్‌, ఫీమేల్ పాత్ర‌లు ఉన్నాయ‌ట‌.

ఈ విల‌న్ల‌లో ఒక‌రు జ‌గ‌ప‌తిబాబు. లెజెండ్ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా మెప్పించాక అత‌డి కెరీర్ ట‌ర్న్ అయిపోయింది. ఇక ఈ సినిమాలో లేడీ విలన్ గా ఓ హీరోయిన్ నటించబోతుంది. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఈ చిత్రంలో విలన్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ఫీమేల్ విల‌న్ ఎవ‌రో కాదు… కోలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్ కుమార్తె వ‌ర‌ల‌క్ష్మి.

ఇక మెయిన్ హీరోయిన్‌గా జై సింహాలో చేసిన క‌న్న‌డ‌మ్మాయి హ‌రిప్రియ పేరునే ఫైన‌లైజ్ చేస్తారంటున్నారు. ఇక సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌నిర్మాత సీ క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. జై సింహా లాంటి హిట్ కాంబినేష‌న్ త‌ర్వాత ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. మే 17న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభ‌మ‌య్యి… జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

బాలయ్యకు విలన్ గా హీరోయిన్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share