
అంతా ఆ దేవుడి దయ… దేవుడి దయ లేకుంటే ఏనాడో చనిపోయేవారిమి… ఆ దేవుడి దయ ఉంది కనుకనే అందరం లీడర్లం అయ్యాం… దేవుడి దయతోనే విమాన ప్రమాదం నుంచి బతికి బట్టకట్టామని ఆనాటి జ్ఞాపకాలను నెమరెసుకుంది విజయశాంతి. తెలుగు లో టాప్ హీరోయిన్గా ఎదిగి తరువాత రాజకీయ రంగంలో విజయవంతంగా తన పాత్రను పోషించి, తిరిగి తెరంగ్రేటం చేస్తున్న విజయశాంతి నాటి మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంది.
మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న వేళ… అందరం ఎంతో హుషారుగా విమానంలో వెళుతున్నాం.. ఉన్నట్టుండి విమానంలో ఏదో లోపం తలెత్తిందట… ఈ విషయం ప్రయాణికులకు తెలియపర్చారు… దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యాం… అయితే పైలట్ సేఫ్గా విమానంను లాండ్ చేశాడు. లాండింగ్ సమయంలో క్రాష్ లాండింగ్ కావడంతో అది పేలిపోతుందని భయమేసింది. కాని ఏమి జరుగలేదు అని తెలిపింది విజయశాంతి…
విమానం క్రాష్ లాండ్ కావడంతో విమానం పేలిపోతుందనే భయమేసింది… ఈ విమానం కనుక పేలిపోతే అందులో ఉన్న చిరంజీవి, బాలకృష్ణతో పాటు ఎందరో ప్రముఖులు అందులోనే చనిపోయేవారము. కాని దేవుడి దయతో అంతా బతికాం. ఇప్పటి ఈ విషయం అందరికి గుర్తుండే ఉంటుంది. ఆనాడు మేమంతా చనిపోతే అనేదే గుర్తుకొస్తే ఎంతో భయం వేస్తుంది అని విజయశాంతి గతాన్ని గుర్తు చేసుకుంది. సో ఆనాడు విమాన ప్రమాదం జరిగితే మనమంతా మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యబాబును, విజయశాంతిని కోల్పోయేవారమన్నమాట.