స్నేహితులు,అభిమానులకు బాలయ్య దూరం దూరం

June 17, 2019 at 6:13 pm

సినిమా హీరోల్లో సీనియర్ హీరో యువరత్న బాలకృష్ణ స్టైలే వేరు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో.. ఎవరి అంచనాలకూ అందరు. బాలయ్య ఎప్పుడు నవ్వుతారు… ఆయన కోపం ఎప్పుడు కట్టలుతెంచుకుంటోంది.. ఆయన చేతికి ఎప్పుడు పని చెబుతారో ఎవరి అంచనాలకూ దొరకవు. ఇదిలా ఉంటే బాలయ్య ఇటీవల మరి మూడీ ఉంటున్నాడ‌న్న టాక్‌ ఇండస్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో నడుస్తోంది. ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో టిడిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే హిందూపురంలో పోటీ చేసిన బాలయ్య మాత్రం 17 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

వచ్చే ఐదేళ్ల పాటు బాలయ్య ఇక్కడ రాజకీయాలు చేసే అంత సీన్ లేదు. దీంతో మళ్లీ ఆయన సినిమాల్లో బిజీ అయిపోయారు. ఇప్పటికే తన 105వ ప్రాజెక్టును లాంచ్ చేశారు. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య పుట్టినరోజు జరిగింది. ఈ పుట్టిన రోజు నాడు తనకు బాగా కావాల్సిన సన్నిహితులను కూడా ఆయన దూరం పెట్టినట్టు తెలుస్తోంది. బాలయ్య ఇంట్లోనే ఉండి లేడని చెప్పించారని సన్నిహితులంతా పోతున్నారట.

ఇక ఓ ద‌ర్శ‌కుడు బాల‌య్య‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆయ‌న‌కు అదే తిర‌స్క‌ర‌ణ జ‌రిగింద‌ట‌. ఇక అబిమానులు కొద్దిమంది ఆయ‌న ద‌గ్గ‌ర‌కు శుభాకాంక్ష‌లు చెప్పేందుకు వెళ్లినా వారిపై కూడా త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ అధికారంలోకి రాలేద‌న్న అసంతృప్తి ఉండ‌డ‌మే అట‌. కోపం వ‌ల్ల ఇప్ప‌టికే కొంత‌మంది అభిమానుల్ని కోల్పోయాడు బాల‌య్య‌. ఈ ప‌రిస్థితి మార‌క‌పోతే ఇక‌పై కొత్త జ‌న‌రేష‌న్ వారు ఆయ‌న‌కు మ‌రింత‌గా దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది.

స్నేహితులు,అభిమానులకు బాలయ్య దూరం దూరం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share