బాలయ్య ,ఎన్టీఆర్ మ‌ధ్య చిచ్చుపెట్టిన నాని

April 20, 2019 at 11:55 am

ఒక‌రిని మెచ్చుకుంటే మ‌రొక‌రు నొచ్చుకుంటారు. సినీ ఇండ‌స్ట్రీలో ఇది ఇంకా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇప్పుడు తిన్న‌నూని గౌత‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో నాని-శ్ర‌ద్ధ శ్రీ‌నాథ్ జంట‌గా న‌టించిన చిత్రం జెర్సీ సూప‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. ఓ క్రికెట‌ర్ జీవితం ఆధారంగా ఫిక్స‌న‌ల్‌గా తెర‌కెక్కించిన ఈ చిత్రంపై సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌ధానంగా నాని న‌ట‌న‌ను మెచ్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా నాని న‌ట‌న‌ను మెచ్చుకున్నారు.

ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా ఎన్టీఆర్ జెర్సీ సినిమాను చూసి మ‌రీ నాని న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. క్రికెట‌ర్‌గా, ప్రేమికుడిగా, భ‌ర్త‌గా, తండ్రిగా నాని ప‌లికించిన భావోద్వేగాలు అంద‌రినీ క‌ట్టిప‌డేస్తున్నాయి. నిజానికి.. ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తోనే అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ఇక శుక్ర‌వారం విడుద‌లైన మొద‌టి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న జెర్సీ టీమ్‌ను ప్రేక్ష‌కుల‌తోపాటు ఇండ‌స్ట్రీవ‌ర్గాలు కూడా మెచ్చుకుంటున్నాయి.

అయితే.. ఇక్క‌డ బాల‌య్య‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు మ‌ధ్య నాని ఎలా చిచ్చుపెట్టాడ‌ని అనుకుంటున్నారా..? మ‌రేం లేదు.. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్‌లో ఎంతో బిజీగా ఉండికూడా ఎన్టీఆర్ జెర్సీ సినిమా చూశాడు. అంత‌కుముందు విడుద‌ల అయిన ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్ చూడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ అంశ‌మే.. ఇప్పుడు బాబాయ్, అబ్బాయ్ మ‌ధ్య చిచ్చుపెట్టింద‌నే టాక్ ఇండ‌స్ట్రీవ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా.. జెర్సీ మొద‌టి రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా సుమారు రూ.7కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.5కోట్ల షేర్ సాధించడం గ‌మ‌నార్హం.

బాలయ్య ,ఎన్టీఆర్ మ‌ధ్య చిచ్చుపెట్టిన నాని
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share