జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను మ‌ళ్లీ వాడుతోన్న బాల‌య్య‌

May 13, 2019 at 11:16 am

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కొత్త చిత్రం త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. కేఎస్.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు రూల‌ర్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాలో ఇప్ప‌టికే హ‌రిప్రియ ఓ హీరోయిన్‌గా సెల‌క్ట్ కాగా, లేడీ విల‌న్ రోల్‌కు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక మెయిన్ విల‌న్‌గా జ‌గ‌ప‌తిబాబు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా టైటిల్ విష‌యంలో బాల‌య్య యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌ను ఫుల్‌గా వాడుతున్న‌ట్టు తెలుస్తోంది. బాల‌య్య – ఎన్టీఆర్ మ‌ధ్య సంబంధాలు అంతంత‌మాత్ర‌మే. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఫంక్ష‌న్‌కు ఎన్టీఆర్ వ‌చ్చినా… మొన్న ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ మాత్రం టీడీపీ కోసం బ‌య‌ట‌కు రాలేదు. ఏదేమైనా వీరిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ అతుకుల బొంత మాదిరిగానే ఉంది.

ఇక బాల‌య్య తాజా సినిమా టైటిల్ విష‌యానికి వ‌స్తే జూనియర్ ఎన్టీఆర్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన దమ్ము సినిమాలో రూల‌ర్ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమా ప్లాప్ అయినా సాంగ్ వ‌ర‌కూ హిట్టే. ఇప్పుడు అదే సాంగ్‌లోని రూల‌ర్‌ను బాల‌య్య టైటిల్‌గా వాడేసుకుంటున్నాడు. ఎన్టీఆర్‌తో చాలా విష‌యాల్లో ఇగో ప‌రంగా విబేధించే బాల‌య్య‌కు ఇప్పుడు అత‌డి సాంగ్ ప‌ల్ల‌వి టైటిల్ పెట్టుకోవ‌డానికి ఇగో అడ్డు రాలేదా ? అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను మ‌ళ్లీ వాడుతోన్న బాల‌య్య‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share