కన్నడ హీరోయిన్ తో బాలయ్య రొమాన్స్ !

May 8, 2019 at 12:12 pm

అటు సినిమాలు, ఇటు రాజ‌కీయాల్లో య‌మ‌స్పీడుగా దూసుకుపోతున్న బాల‌య్య‌కు ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పి ప‌ట్టుకుంది. రాజ‌కీయాల్లో ఎమ్మెల్యేగా రాణించారు బాల‌య్య బాబు. తిరిగి మొన్న జరిగిన ఆంధ్రప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో హిందూపురం నుండి టీడీపీ అభ్య‌ర్థిగా మ‌రోమారు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను తెలుసుకోబోతున్నారు. ఎన్నిక‌ల్లో వివాధాల‌తో సాగిన బాల‌య్య ఎన్నిక‌ల ప్ర‌చారంలో అనేక వివాదాలు న‌డిచాయి. ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం ఎదురు చూస్తున్న బాల‌య్య ఇప్పుడు సినిమాల‌పై దృష్టి సారించారు.

కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య బాబు కొత్త సినిమా ఫిక్స్ అయింది. ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ల కోసం వెతుకులాట ప్రారంభించార‌ట సిని నిర్మాణ సంస్థ‌. బాల‌య్య‌కు స‌రిజోడి దొర‌క‌డం క‌ష్టంగా మార‌డంతో ప్ర‌తి చిత్రంలో కొత్త హీరోయిన్ల కోసం వెతుకుతూనే ఉంటున్నార‌ని బోగ‌ట్టా. బాల‌య్య బాబుకు జోడి దొర‌క‌లాంటే చాలా క‌ష్ట‌సాధ్యంగా మారుతుంద‌ని సినివ‌ర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

బాల‌య్య‌కు స‌రిజోడిగా పాత హీరోయిన్‌నే ఎంపిక చేస్తున్న‌ట్టు సిని జ‌నాల మాట‌. గ‌తంలో బాల‌య్య‌తో జై సింహాలో హీరోయిన్‌గా న‌టించిన క‌న్న‌డ భామ హ‌రిప్రియ‌ను ఎంపిక చేసిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. హ‌రిప్రియ‌కు తెలుగులో అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో క‌న్న‌డ చిత్ర‌సీమ‌కే ప‌రిమితమ‌య్యారు. తెలుగులో అవ‌కాశాల కోసం క‌ళ్ళు కాయ‌లు కాసేలా ఎదురు చూసిన హ‌రిప్రియ‌కు చివ‌రాఖ‌ర‌కు బాల‌య్య బాబు సినిమానే దిక్కుగా మారింది. హ‌రిప్రియ‌కు బాల‌య్య బాబు సినిమా ఏమేర‌కు తెలుగులో అవ‌కాశాలు క‌లిసొస్తాయో వేచిచూడాల్సిందే… సో బాల‌య్య బాబుకు పాత హీరోయినే దిక్కు కాగా, హ‌రిప్రియ‌కు బాల‌య్య బాబే దిక్కాయ్యారు.

కన్నడ హీరోయిన్ తో బాలయ్య రొమాన్స్ !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share