మ‌రోమారు ద్విపాత్రాభిన‌యంలో బాల‌య్య‌

April 29, 2019 at 12:25 pm

మొన్న‌టి వ‌ర‌కు బాల‌య్య‌, బోయ‌పాటి సినిమా ఉంటుంద‌నుకున్న అభిమానుల‌కు బాల‌య్య క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర్వాత త‌న సినిమా కేఎస్ ర‌వికుమార్ తో అని ప్ర‌క‌టించి బోయ‌పాటికి బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంతో బాల‌య్య చేయ‌బోయే సినిమాకు సంబంధించిన కొన్ని విష‌యాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ర‌వికుమార్ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ని తెలిసింది. బాల‌య్య ఇప్ప‌టికే లెజెండ్‌, సింహా సినిమాల్లో డ‌బుల్ రోల్ చేసి మెప్పించిన విష‌యం ఎరిగిందే.

కాగా, బాల‌య్య సినిమాలో జ‌గ‌ప‌తి బాబు మ‌రోమారు విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. లెజెండ్ సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు ఆక‌ట్టుకున్నారు. అప్ప‌టి నుంచి వ‌రుస అవ‌కాశాల‌తో ద‌క్షిణాదిన జ‌గ‌ప‌తి బాబు విల‌న్ రోల్‌లో బిజీ అయిపోయారు. ఒక ర‌కంగా త‌న సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించార‌ని చెప్పొచ్చు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉన్నా దాదాపు పాత్ర ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది.

ఇక బాల‌య్య సినిమాకు హీరోయిన్ వేట‌లో చిత్ర యూనిట్ ఉన్న‌ట్టు స‌మాచారం. కొత్త హీరోయిన్‌ను తీసుకుంటారో లేక గ‌తంలో బాల‌య్య స‌ర‌స‌న చేసిన ఎవ‌రినైనా సీనియ‌ర్‌ను సెలెక్ట్ చేస్తారో చూడాలి మ‌రీ. మొత్తంగా ఈ సినిమా షూటింగ్ త‌ర్వ‌లోనే ప్రారంభ కానున్న‌ట్టు స‌మాచారం. రామోజీ ఫిలిం సిటీలో మొద‌టి షెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నంద‌మూరి నుంచి వ‌స్తున్న ఈ సినిమాపై ఇండ‌స్ర్టీలో బోలెడ్ అంచ‌నాలు ఉన్నాయి

మ‌రోమారు ద్విపాత్రాభిన‌యంలో బాల‌య్య‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share