బాల‌కృష్ణ‌, నాగార్జున‌కు ఏమైంది… ఇద్ద‌రూ డౌటేనా…!

June 19, 2019 at 10:36 am

సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ లో సీనియర్ హీరోలు బాలకృష్ణ, నాగార్జున తమ సినిమాలను లైన్లో పెట్టేస్తుంటారు. కొద్ది సంవత్సరాలుగా సంక్రాంతికి వస్తున్న నాగ్-బాలయ్య మంచి హిట్లు కొడుతున్నారు. నాగార్జునకు చాలా ఏళ్ల తర్వాత సోగ్గాడే చిన్నినాయన రూపంలో సంక్రాంతికి సూపర్ హిట్ సినిమా లభించింది. ఇక బాలయ్య సంక్రాంతికి వరుసపెట్టి సినిమాలు వదులు తున్నాడు. డిక్టేటర్ – గౌతమీపుత్ర శాతకర్ణి – జై సింహ – క‌థానాయకుడు ఇలా ప్రతి సంక్రాంతికి గత కొన్నేళ్లుగా బాలయ్య సినిమా వస్తూనే ఉంది.

ఇదిలా ఉంటే 2020 సంక్రాంతికి మాత్రం ఇద్దరు సీనియర్ హీరోలు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. బాలయ్య – కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ముందుగా సంక్రాంతికి వస్తుందని అనుకున్నారు. కె.ఎస్.రవికుమార్ ఒకసారి సినిమా స్టార్ట్ చేశారంటే మూడు నెలల్లోనే కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ చేతిలో పెట్టేస్తారు. ఈ లెక్కన చూస్తే దసరాకు కాస్త అటు ఇటుగా బాల‌య్య 105 థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ లెక్కన చూస్తే 2020 సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే. కె.ఎస్.రవికుమార్ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి సినిమా చేయనున్నారు.

ఇక నాగార్జున బంగార్రాజు సినిమా ముందుగా సంక్రాంతి అనుకున్నారు. సంక్రాంతికి మహేష్, బన్నీ, ర‌జ‌నీ సినిమాలు ఉన్నాయి. ఈ పోటీలో తన సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని భావించి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ముందుగానే క్రిస్మస్ సీజన్ లో బంగార్రాజు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ఏదేమైనా ప్ర‌తి సంక్రాంతికి ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ల‌లో ఎవ‌రో ఒక‌రు సంద‌డి చేస్తుంటారు. ఈ సారి ఈ ఇద్ద‌రు సినిమాలు లేని సంక్రాంతి బాక్సాఫీస్ సంద‌డి చూడ‌బోతున్నాం.

బాల‌కృష్ణ‌, నాగార్జున‌కు ఏమైంది… ఇద్ద‌రూ డౌటేనా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share