బాల‌య్య‌-రాజ‌శేఖ‌ర్‌ క్రేజీ కాంబినేషన్!

March 21, 2019 at 10:45 am

టాలివుడ్‌లో ఒక‌రేమో యాంగ్రియంగ్‌మ‌న్ గా పేరు పొందారు.. మ‌రొక‌రు త‌న పంచ్‌ డైలాగ్ ల‌తో అభిమానుల‌ను అ ల‌రించే స్టార్‌… తెలుగు సినిమాలో ప‌వ‌ర్‌పుల్ పాత్ర‌ల‌కు ఈ ఇద్ద‌రూ న‌టులు పెట్టింది పేరు. ఈ ఇద్ద‌రు కలిసి ఓ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే చాలా విచిత్రంగా అనిపిస్తోంది కదా? అయితే త్వ‌ర‌లోనే ఈ ఊహ నిజం కాబోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు హీరోలు క‌లిసి న‌టిస్తున్నార‌నే వార్త ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంత‌కీ వాళ్లు ఎవ‌రనుకుంటున్నారా… మ‌రెవ‌రో కాదు.. సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, రాజశేఖర్.

బాల‌కృష్ణ‌, రాజ‌శేక‌ర్ కలిసి ఓ తమిళ రీమేక్‌లో నటించబోతున్నారనే వార్త టాలివుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఇది నిజ‌మా.. కాదా అన్న‌ది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. మొత్తానికైతే ఈ రూమర్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. భార్యాభర్తలైన దర్శకులు పుష్కర్-గాయత్రి కలిసి త‌మిళంలో తీసిన మల్టీస్టారర్ మూవీ విక్రమ్ వేద. 2017లో విడుదలైన ఈ చిత్రంలో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింద‌న‌డంలో ఏ మాత్రం అతిశ‌యోక్తి లేదు.

ఐఎండీబీ హైయెస్ట్ రేటింగ్ ఇచ్చిన ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీలో షారుఖ్ ఖాన్‌తో పాటు మరో స్టార్ ఈ రీమేక్‌లో నటిస్తారంటున్నారు. తెలుగులో ఒక హీరోగా ముందు నాగార్జున పేరు వినిపించింది. కానీ ఇప్పుడు నాగ్ స్థానంలో బాలయ్య-రాజశేఖర్ పేర్లు తెరపైకి వచ్చాయి. రెండేళ్ల క్రితం విడుద‌లైన ‘గరుడవేగ’తో రాజ‌శేఖ‌ర్ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చారు. ప్రస్తుతం ‘కల్కి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. పోలీస్ పాత్రలకు రాజశేఖర్ పెట్టింది పేరు కాబట్టి అతనే మాధవన్ పాత్రలో కనిపించవచ్చు. బాలయ్య విజయ్ సేతుపతి చేసిన రౌడీ పాత్ర చేయొచ్చ‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

బాల‌య్య‌-రాజ‌శేఖ‌ర్‌ క్రేజీ కాంబినేషన్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share