షేర్ ఆటోలో బెల్లంకొండ‌…!

June 11, 2019 at 6:42 pm

హైద‌రాబాద్ న‌గ‌రం… నిత్యం షేర్ ఆటోల‌తో, సిటి బ‌స్సుల‌తో, మైట్రో రైలుతో, బైక్‌ల‌తో నిండిపోయి ఉంటుంది. వాహానాల ర‌ణ‌గొణ ధ్వ‌నుల మ‌ధ్య‌నే సామాన్యుడి జీవ‌నం సాగుతోంది. ఓ సామాన్య మానవుడు ఈ షేర్ ఆటోల్లో, బ‌స్సుల్లో, వాహ‌నాల్లో న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తూ బ‌తుకుబండిని లాగుతున్నాడు. ఇలాంటి ప‌రిస్థితిని అనుభ‌విస్తే కాని తెలియ‌దు. ఈ అనుభ‌వం ఎలా ఉంటుందో చూడాల‌నే త‌ప‌న‌, తాప‌త్ర‌యంతో వాయు, శ‌బ్ధ కాలుష్య న‌గ‌ర‌మైన హైద‌రాబాద్ మెట్రో లో కాలుమోపాడు ఈ కుర్రాడు..

కోట్ల‌కు ఆధిప‌తి… కాలు తీసి కాలు బ‌య‌ట పెడితే ప‌నిమ‌నుషులు. ఎప్పుడు ఏ కారులో బ‌య‌టికి వెళ్ళాలంటే ఆ కారు సిద్ధం. అలాంటి కోటీశ్వ‌రుడి కొడుకు హైద‌రాబాద్ న‌గ‌రంలో రోడ్డుపై కాలు మోపాడు. అత‌డు కోటీశ్వ‌రుడి కొడుకే కాదు ఓ టాప్ హీరో కూడా. అలాంటి హీరో రోడ్డుపై షేర్ ఆటోలో ప్ర‌యాణం చేస్తే ఏలా ఉంటుంది. బ‌స్సులో వెళితే ఎలా ఉంటుంది. మెట్రోలో, మోటార్ బైక్‌పై వెళితే ఎలా ఉంటుందో చూడాల‌నే ఆలోచనే కొత్త‌గా ఉంది క‌దా.

కాని అత‌డు షేరో ఆటో ఎక్కి హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌ర్నీ చేశాడు. మోటారు బైక్‌పై తిరుగుతూ షికారు చేశాడు. స్నేహితుల‌తో త్రిబుల్ రైడింగ్ చేశాడు. మెట్రో రైలు ఎక్కి కొత్త అనుభూతిని పొందాడు. మెట్రో ఎక్స్‌ప్రెస్ బ‌స్సులో సాదార‌ణ ప్ర‌యాణికుడిగా తిరిగాడు. చివ‌రికి ఒక్క‌డే సొంతంగా బైక్‌పై రియ్యిమంటూ హైద‌రాబాద్ న‌గ‌రంలో తిర‌గ‌డం విశేషం. ఇంత‌కు ఎవ‌ర‌త‌గాడు అనేది చెప్ప‌లేదు క‌దూ.. అదేనండి బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌. అత‌డు షేరో ఆటోలో, మెట్రో రైలులో, బ‌స్సులో, మోటారు బైక్‌పై తిరిగిన చిత్రాల‌ను ట్విట్ట‌ర్లో పోస్టు చేశాడు బెల్లంకొండ‌. ఈ చిత్రాలు ఇప్పుడు నెట్టింట్లో హాల్‌ఛ‌ల్ చేస్తున్నాయి. ఇంతకు ఈ ఫోటోల‌ను కిషోర్ కృష్ణ‌మూర్తి అనే ఫోటో గ్రాఫ‌ర్ క్లిక్‌మ‌నిపించాడు.

షేర్ ఆటోలో బెల్లంకొండ‌…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share