హోట‌ల్లో బుమ్రాతో టాలీవూడ్ హీరోయిన్…?

June 20, 2019 at 11:14 am

జ‌నాలంతా క్రికెట్ మానియాతో ఊగిపోతున్నారు… భార‌త క్రికెట‌ర్లు బిజి షెడ్యూల్‌తో ప్ర‌పంచ‌క‌ప్‌లో బిజిగా ఉన్నారు…
ఇంగ్లాడ్ వేదిక‌గా జ‌రుగుతున్న ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త క్రికెట‌ర్లు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్ళారు. మ‌రి పెళ్ళికాని యువ క్రికెట‌ర్లు మాత్రం త‌మ గర్ల్‌ప్రెండ్‌ల‌ను వెంటేసుకుని వెళ్ళారు.. అయితే ఇందులో ఓ పెళ్ళికాని క్రికెట‌ర్ ఓ టాలీవుడ్ భామ‌తో ఇంగ్లాడ్‌లో చ‌ట్ట‌పట్టాలేసుకుని తిరుగుతున్న‌ట్లు ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఏవ‌రా క్రికెట‌ర్ అని ఆరా తీసి చూస్తే మ‌న బౌన్స‌ర్ల వీరుడు బుమ్రా అని తేలింది. కాని ఆయ‌న‌తో అతి స‌న్నిహితంగా ఉన్న సుంద‌రి ఎవ‌ర‌న్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అయితే భార‌త చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌తో ఇటీవ‌ల జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ భారీ విజ‌యం సాధించింది. పాకిస్తాన్ మ్యాచ్ త‌రువాత మ‌రోమ్యాచ్‌కు ఎక్కువ రోజుల గ్యాప్ వ‌చ్చింది. ఇదే అద‌నుగా భావించిన భార‌త క్రికెట‌ర్లు రెండు రోజులు ప్రాక్టీస్‌కు దూరం కావాల‌ని, కుటుంబంతో స‌ర‌దాగా గ‌డుపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అంతే అంద‌రు క్రికెట‌ర్లు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో కాల‌క్షేపం చేస్తూ గ‌డిపారు. కాని ఇందులో ఓ జంట మాత్రం హోట‌ల్ లో జంట‌ప‌క్షుల్లా, ఇద్ద‌రు హ‌త్తుకుని న‌డుస్తూ కెమెరాకు చిక్కారు.

ఈ ఇద్ద‌రి జంట ఎవ‌రిదై ఉంటుంద‌నే అనుమానం స‌గ‌టు మ‌నిషికి రాక త‌ప్ప‌దు. ఆ అనుమానాల‌ను నివృత్తి చేసుకునే క్ర‌మంలో తెలిసిన విష‌యం షాకింగ్ విష‌యం ఏమిటంటే భార‌త యువ‌ఫాస్ట్ బౌల‌ర్‌, యార్క‌ర్లు, బౌన్స‌ర్ల వీరుడు జ‌స్‌ప్రీత్ బుమ్రా అని తేలింది. అయితే మ‌రి బుమ్రాతో క‌లిసి చేతిలో చేయివేసుకుని వ‌య్యారంగా న‌డుస్తున్న సుంద‌రి ఎవ‌రై ఉంటార‌నే అనుమానం త‌ట్టింది. ఈ అనుమానాల్ని నివృత్తి చేసుకునే క్రమంలో మ‌రో కొత్త విష‌యం తెలిసింది ఏంటంటే ఆమే టాలీవుడ్ భామ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ అని. సో అనుప‌మా ప‌ర‌మేశ్వ‌రన్‌తో బుమ్రా డేటింగ్ చేస్తున్న‌ట్లు వ‌చ్చిన గాసిప్ నిజ‌మేన‌ని తేలిపోయింద‌న్న‌మాట‌.

హోట‌ల్లో బుమ్రాతో టాలీవూడ్ హీరోయిన్…?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share