చిరంజీవి సంచ‌ల‌న నిర్ణ‌యం…?

May 12, 2019 at 10:50 am

మెగాస్టార్ చిరంజీవి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టాలీవుడ్ లోనే మోస్ట్ పాపుల‌ర్ హీరో చిరంజీవి. త‌న న‌ట‌న‌తోనే తెలుగు చిత్ర‌సీమ‌కే కొత్త ఒర‌వ‌డి కి శ్రీ‌కారం చుట్టారు. ఫైటింగ్‌లు, బ్రేక్ డ్యాన్స్‌ల‌ను వెండితెర‌పై ప‌రిచ‌యం చేసిందే చిరంజీవి. చిత్ర రంగానికి అందిన ఆణిముత్యాల్లో చిరంజీవి ఒక‌రుగా నిలిచిపోతారు. అలాంటి చిరంజీవి 2009లో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

సిని రంగానికి విరామం ప్ర‌క‌టించిన చిరంజీవి 2009లో ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించి రాజ‌కీయ అరంగ్రేటం చేశారు. చిరంజీవి రాజ‌కీయంలోకి వ‌స్తారని ఆరోజు ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించి 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ చేసిన చిరంజీవి పార్టీ 18 ఎమ్మెల్యే స్థానాల‌ను గెలుచుకొన్నారు. అనివార్య కార‌ణాల‌తో చిరంజీవి త‌న పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయ‌డం, త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కేంద్ర ప‌ర్యాట‌క మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఇలా రాజ‌కీయ రంగంలోను త‌న‌కంటూ ఓ ముద్ర వేసుకున్న త‌ర్వాత చిరంజీవి కొంత‌కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.

తిరిగి చిరంజీవి సిని రంగ పునః ప్ర‌వేశం చేసి ఖైదీ నంబ‌ర్ 150 న‌టించి అభిమానుల‌ను అల‌రించారు. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే చిరంజీవి వ్యాపార రంగంపై దృష్టి సారించారు. త‌న కుమారుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో వ్యాపారాలు చేయిస్తున్న చిరంజీవి ఇప్పుడు విద్యారంగంపై దృష్టి సారించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లుగా ఉండే విద్యారంగంలో పాఠశాల‌ను అధునాత, నూత‌న ఒర‌వ‌డితో ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగా చిరంజీవి ఇంట‌ర్నేష‌న‌ల్ పాఠ‌శాల‌ను ప్రారంభిస్తున్న‌ట్లు సీఈఓ జె.శ్రీ‌నివాస‌రావు ప్ర‌క‌టించారు. శ్రీ‌కాకుళం శివారులో పెద్ద‌పాడు వ‌ద్ద పాఠ‌శాల ఏర్పాటుకు చ‌క‌చ‌కా ముందుకు సాగుతున్నారు. గౌర‌వ వ్య‌వ‌స్థాప‌కుడిగా చిరంజీవి, రామ్‌చర‌ణ్ గౌర‌వాధ్య‌క్షుడిగా, నాగ‌బాబు చైర్మ‌న్‌గా, చిరంజీవి యువ‌త అఖిల భార‌త అధ్య‌క్షుబు స్వామినాయుడు క‌న్వీన‌ర్‌గా ఈ పాఠ‌శాల నెల‌కొల్పుతున్నారు.

చిరంజీవి సంచ‌ల‌న నిర్ణ‌యం…?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share