ఇక ఫుల్ టైం చిరు చిందులు..!

November 11, 2018 at 10:11 am

కార‌ణాలు ఏమైనా కావొచ్చు.. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారా..? ఇక ఫుల్ టైం సినిమాల‌కే అంకితం అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారా..? అంటే తాజా ప‌రిస్థితులు మాత్రం ఔన‌నే అంటున్నాయి. రాజ‌కీయాల్లో కొత్త‌గా అనైతిక బంధాలు రూపుదిద్దుకుంటున్న వేళ‌.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిద‌నే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ వీడేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని చిరు భావిస్తున్నార‌ని, ఒక‌టి రెండు రోజుల్లోనే ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్లు కాంగ్రెస్‌ను వీడారు. వీరి దారిలోనే చిరు కూడా వెళ్తున్న‌ట్లు స‌మాచారం. అయితే.. త‌మ్ముడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌తో క‌లిసి న‌డిచే అవ‌కాశాలు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో ఆయ‌న మ‌ళ్లీ సినిమాల‌పై పూర్తిస్థాయిలో ద‌`ష్టికేంద్రీక‌రిస్తార‌ని అనుచ‌రులు అంటున్నారు.khaidi-no-150-chiranjeevi

నిజానికి.. ఎప్ప‌టి నుంచో చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎలాంటి కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌న పాల్గొన‌డం లేదు. అయితే, ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీలో చిరు చేరుతార‌ని, అందుకే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఆ మ‌ధ్య హైద‌రాబాద్‌లో చిరు అభిమానుల‌తో ప‌వ‌న్ భేటీ కావ‌డంతో ఇక చిరు చేరిక లాంఛ‌న‌మేన‌న్న టాక్ బ‌లంగా వినిపించింది. కానీ.. ఈ ఊహాగానాల‌న్నీ ఉట్టివేన‌ని తేలిపోయింది. రాజ‌కీయాల‌పై ఆయ‌న తీవ్ర అస‌హ‌నంతో ఉన్నార‌ని, పార్టీని వీడేందుకు అదును కోసం చూస్తున్నార‌ని ఈ మ‌ధ్య మ‌ళ్లీ ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా.. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేతులు క‌లుప‌డాన్ని సాకుగా చూపించి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయ‌డ‌మే కాకుండా రాజ‌కీయాల‌కు స్వ‌స్తిప‌లికేందుకు చిరు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.chiranjeevis-khaidi-no-150-has-been-censored-with-ua-photos-pictures-stills-1

2009లో ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించ‌డం.. అనుకున్న రీతిలో సీట్లు గెల‌వ‌లేక‌పోవ‌డం.. 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డం..దీనికి ప్ర‌తిఫ‌లంగా చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి పదవి ద‌క్క‌డం చ‌క‌చకా జ‌రిగిపోయాయి. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ సినిమాల‌పై ద‌`ష్టి సారించారు. ఈ క్ర‌మంలో ఖైదీ నెంబర్‌ 150 చిత్రంతో త‌న స‌త్తా ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించారు. తాజాగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తెలుగు వెండితెర చిరుతో మ‌ళ్లీ మెరిసిపోతుంద‌ని ఆయ‌న అభిమానులు సంబుర‌ప‌డుతున్నారు. ఏదేమైనా.. రాజ‌కీయరంగంలో విఫ‌ల‌మైనా.. సినీరంగంలో మాత్రం ఆయ‌న ఇమేజ్ త‌గ్గ‌లేద‌నే అంటున్నారు.

ఇక ఫుల్ టైం చిరు చిందులు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share