కొత్త హీరోయిన్ పై చిరంజీవి మోజు!

June 26, 2019 at 5:08 pm

మెగాస్టార్ చిరంజీవికి కొత్త పాప కావాల‌ట‌… పాత పాప‌ల‌తో ప‌నిలేదు కాని కొత్త పాప‌లైతే చెప్పిన‌ట్లు వింటారు… విన్న‌ట్లు చేస్తారు… జోడీ మంచిగా కుదురుతుంద‌ని ఓ కొత్త పాప కోసం అన్వేష‌ణ ప్రారంభించారు. ఇంత‌కు కొత్త పాప కోసం చిరంజీవి ప‌డ‌రాని పాట్లు ఎందుకు ప‌డుతున్న‌ట్లు అని అనుకుంటున్నారా… అదేనండి చిరంజీవి కొత్త సినిమా కోసం కొత్త పాప కావాల‌ట‌..

చిరంజీవి ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తున్నారు. సైరా సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక ఫ్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. మ‌రో ప‌క్క డ‌బ్బింగ్ ప‌నులు కూడా విరామం లేకుండా రాత్ర‌న‌కా ప‌గ‌ల‌న‌కా సాగుతున్నాయి. డ‌బ్బింగ్ ప‌నుల్లో చిరంజీవి 24గంట‌లు క‌ష్ట‌పడుతున్నాడు. త్వ‌ర‌లో సైరా సినిమా ప‌నులు పూర్తి చేసుకుని మ‌రో సినిమాకు కొబ్బ‌రి కాయ కొట్టేందుకు సిద్ధ‌మవుతున్నాడు చిరంజీవి.

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ చిరంజీవితో త‌రువాత సినిమాను ప్లాన్ చేశాడు. చిరంజీవి సైరా పూర్తి కాగానే కొర‌టాల శివ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇప్ప‌టికే కొర‌టాల శివ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ప‌నులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తి చేశాడ‌ట‌. ఇక మిగిలింది చిరంజీవితో క‌లిసి న‌టించే తార‌గ‌ణం. అయితే ఇక్క‌డే కొర‌టాల శివ చిరంజీవి స‌ర‌స‌న న‌టించేందుకు ఓ కొత్త‌భామ‌ను ఎంపిక చేస్తున్నాడ‌ట‌. టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లు అంద‌రు చిన్న హీరోల స‌ర‌స‌న న‌టించిన వారే. అందుకే ఓ కొత్త మోడ‌ల్‌ను ఎంపిక చేస్తే బాగుంటుంద‌ని ఆమేర‌కు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిసింది. చిరంజీవి కూడా కొత్త భామ‌ను వెత‌కండి అని చెప్పాడ‌ట‌. సో చిరంజీవి టాలీవుడ్‌కు ఓ కొత్త భామ‌ను ప‌రిచ‌యం చేస్తున్నాడ‌ట‌న్న మాట‌.

కొత్త హీరోయిన్ పై చిరంజీవి మోజు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share