మెగా హీరోకు బంప‌రాఫ‌ర్‌…!

June 24, 2019 at 12:40 pm

టాలీవుడ్‌లో తిరుగులేని హీరోలు మెగా కుటుంబ హీరోల‌దే. అలాంటి మెగా హీరోలకు ఇప్పుడు బంఫ‌రాఫ‌ర్ వ‌చ్చిప‌డింది. ఈ ఆఫ‌ర్‌ను మెగా హీరోలు ఓకే చేస్తారా లేక ఒదులుకుంటారా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. మెగా హీరోల‌కు వ‌చ్చిన ఆఫ‌ర్ న‌ట‌న‌కు కాదండోయ్‌…. గాత్రం అరువిచ్చినందుకు… మ‌రి గాత్రం అరువిచ్చి ఈ బంఫ‌రాఫ‌ర్‌ను త‌న్నుకుపోతారా లేక త‌న్నిప‌డేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇంత‌కు మెగా హీరోలకు త‌గిలిన ఈ బంఫ‌రాఫ‌ర్ ఇచ్చింది ఎవ‌రు… మెగా హీరోలు ఎవ‌ర‌నే క‌దా మీ డౌట్‌. ఇంకెవ‌రండీ మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లే. తండ్రికొడుకులు ఇద్ద‌రి గాత్రం కోసం ఓ మెగా ప్రాజెక్టు ఆఫ‌ర్ రెడి చేసి ఉంచింది. మెగా హీరోల‌ను సంప్ర‌దించింద‌నే ప్ర‌చారం సాగుతుంది. మ‌రి ఈ ఆఫ‌ర్‌ను ఓకే చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ న‌టులు బాలీవుడ్ హీరోల చిత్రాల‌కు ప్రాంతీయ భాష‌ల్లో త‌మ గాత్రాన్ని అరువిచ్చిన‌వారే అధికం. చిరంజీవి కూడా గ‌తంలో హ‌నుమాన్ కార్టూన్ కోసం గాత్రం అరువిచ్చారు. చిరంజీవి త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ కూడా స‌ల్మాన్‌ఖాన్ సిన‌మా ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో సినిమాకు తెలుగు డ‌బ్బింగ్ చెప్పారు. ఇప్పుడు వీరికి డిస్నీ సంస్థ ల‌య‌న్ కింగ్ అనే ప్రాజెక్టును సిద్ధం చేస్తుంది. దీనికి తెలుగులో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ గాత్రం కోసం డిస్నీ సంస్థ వారిని సంప్ర‌దించింద‌ట‌. హిందిలో షారుఖ్‌ఖాన్ – ఆర్య‌న్‌ఖాన్‌లు ఒప్ప‌కున్నార‌ట‌. ఇక మిగిలింది తెలుగులో మ‌రి ఎమంటారో మెగా హీరోలు… వీరు ఒకే అంటే ల‌య‌న్ కింగ్ హిట్ కావ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

మెగా హీరోకు బంప‌రాఫ‌ర్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share