చిత్రలహరి ట్రైలర్ రిలీజ్

April 7, 2019 at 11:37 am

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ తనదైన నటనతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పటివరకు మాస్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేక పోయాడు. ఇదే సమయంలో లో జయ అపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు ఈ క్రమంలోనే ఆయన తాజాగా నటించిన చిత్రం చిత్రలహరి. ఈ సినిమా మా ట్రైలర్ ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో లో సాయి ధరమ్ తేజ్ డైలాగులు ఎంతో కొత్తగా ఉన్నాయి

‘నా పేరు విజయ్‌.. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలో లేదు. ఆ విజయం నా జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను’ అంటూ సాయి ధరమ్ తేజ్‌ చెప్పే డైలాగ్స్ హైలెట్ గా నిలుస్తున్నాయి. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ కథానాయికలు. తన జీవితం ఎంత నరకంగా ఉందో ధరమ్‌ తేజ్‌ వివరిస్తున్న సన్నివేశాలతో సినిమా ట్రైలర్‌ మొదలైంది.

‘ఒకే దిక్కున ఉదయించే సూర్యుడు నాలుగు దిక్కులు ఉదయించినా ఇంత వెలుతురు కూడా రాని జీవితం నాది. ఎందుకంటే చీకటికి చిరునామా నేను..’ అని ధరమ్‌ తేజ్‌ బాధపడుతూ చెబుతున్న డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాను ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిత్రలహరి ట్రైలర్ రిలీజ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share