**డిగ్రీ కాలేజ్‌**పై విరుచుకుప‌డిన జీవిత రాజశేఖర్

May 3, 2019 at 12:38 pm

న‌ర‌సింహ నంది ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్‌, దివ్యారావు హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం **డిగ్రీకాలేజ్‌**. ఈ సినిమా
ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ హైద‌రాబాద్‌లో ఇటీవ‌లే జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన జీవిత రాజ‌శేఖ‌ర్ చిత్ర యూనిట్‌పై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. ట్రైల‌ర్‌ను చూడ‌డంతోనే షాక్‌కు గుర‌య్యాన‌ని చెప్పారు. సినిమాలో శ్రుతిమించిన శ్రుంగారం, లిప్‌లాక్‌లు ఉండ‌డంపై ఏకి పారేశారు.

ఇలాంటి సినిమాకు త‌న‌లాంటి వ్య‌క్తిని పిల‌వ‌డం చిత్ర యూనిట్ చేసిన మొద‌టి త‌ప్ప‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు. త‌ను సెన్సార్ బోర్డు మెంబ‌ర్‌ను అని త‌న‌లాంటి వారిని ఇలాంటి సినిమాల‌కు పిల‌వ‌డం స‌రికాద‌న్నారు. సినిమాలో ఏదైనా ఉండే వ‌ర‌కే ఉంటే బాగుంటుంద‌ని, మోతాదు మించితే అస‌హ్యంగా మారుతుంద‌న్నారు. శ్రుంగారం ప్ర‌తీ వ్య‌క్తి జీవితంలో ఉంటుంద‌ని, అంత మాత్ర‌న బజారున అంద‌రూ చూస్తుండ‌గా శ్రుంగారం చేయ‌లేం కాదా అని ప్ర‌శ్నించారు. అర్జున్‌రెడ్డి, ఆర్ ఎక్స్ 100 సినిమాల పుణ్య‌మా అని లిప్‌లాక్‌లు లేకుండా సినిమాలు ఉండేలా తెలుగుసినిమాలు ఉండ‌వా అనే విధంగా త‌యారైంద‌న్నారు.

సెన్సార్ బోర్డు స‌భ్యురాలిగా ఇలా మాట్లాడుతున్నందుకు ఏం అనుకోవ‌ద్దంటూనే దుయ్య‌బ‌ట్టారు. ద‌ర్శ‌కులను, న‌టీన‌టుల‌ను ఏం అన‌లేం అంటూ పేర్కొన్నారు. ఇలాంటి అభ్యంత‌రాల‌తో సినిమా విడుద‌ల‌ను ఆపేస్తే ప్రెస్‌మీట్ పెట్టి సెన్సార్ బోర్డుపై అంభండాలు వేస్తున్నార‌ని జీవిత అన్నారు. ఒంట‌రిగా చేస్తే సెక్స్‌కు అంద‌మ‌ని, అంతేకానీ కుటుంబం మొత్తంగా క‌లిసి పంచుకోదు క‌దా అన్నారు. సినిమా కూడా ఒంట‌రిగా కూర్చునే చూసేది కాదు క‌దా అని ఫ్యామిలీ మొత్తంగా క‌లిసి వ‌స్తార‌ని ఉద‌హ‌రించారు.

**డిగ్రీ కాలేజ్‌**పై విరుచుకుప‌డిన జీవిత రాజశేఖర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share