డిఎస్పీపై అభిమానుల గుస్సా..!

May 10, 2019 at 3:12 pm

సిని అభిమానుల‌ను త‌న పాట‌లు, మాట‌లు, సంగీతంతో మంత్రం వేసి మంత్ర‌ముగ్ధుల‌ను చేసి మైమ‌రింపిచే డిఎస్పికి ప్రిన్స్ మ‌హేష్‌బాబు అభిమానుల నుంచి ఊహించ‌ని నిర‌స‌న ఎదురవుతుంది. ప్రిన్స్ న‌టించిన మ‌హ‌ర్షి సినిమా ఇటీవ‌ల విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా అభాల గోపాలాన్ని అల‌రిస్తుంది. కాని సంగీత ద‌ర్శ‌కుడు డిఎస్పి అలియాస్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం మాత్రం అభిమానుల‌ను అల‌రించ‌లేక పోతుంది. దీంతో అభిమానులు డిఎస్పిపై గ‌రం గ‌రంగా ఉన్నారు.

దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అంటే ఇప్పుడు టాలీవుడ్‌లో ఎదురేలేదు. ఇళ‌య‌రాజా ,ఎంఎం కిరవాణి, మ‌ణిశ‌ర్మ లాంటి సంగీత ద‌ర్శ‌కుల స‌ర‌స‌న దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం నిలుస్తుంది. ప్ర‌స్తుత టాలీవుడ్‌లో దేవి శ్రీ ప్ర‌సాద్ త‌ర్వాతే ఏ సంగీత ద‌ర్శ‌కుడైనా అనే టాక్ ఉంది. అలాంటి సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీ పై మ‌హేష్‌బాబు అభిమానులు గుస్సాగా ఉన్నారు. మ‌హ‌ర్షి సినిమాకు దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు కావ‌డ‌మే కార‌ణం.

సాధార‌ణంగా దేవి శ్రీ ప్ర‌సాద్ ఏ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా కొత్త‌ద‌నం ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు ఆశిస్తారు. డిఎస్పీ సంగీతం అందించిన కుమారి ఎఫ్‌21 వంటి చిన్న సినిమా కూడా హిట్‌ను సొంతం చేసుకుంది. అందులో డీఎస్పీ సంగీతం విర‌గ‌దీయడంతో సినిమా అంచ‌నాల‌కు మించి విజ‌యం సాధించింది. అలాంటిది ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమా కు సంగీతం దేవి శ్రీ ప్ర‌సాద్ రేంజ్‌లో లేద‌ని, మిగ‌తా సినిమాల్లో తాను రూపొందించిన సంగీతాన్నే కాపీ కొట్టాడ‌ని అభిమానులు డిఎస్పీపై అగ్ర‌హంతో ఉన్నారు.

డిఎస్పీపై అభిమానుల గుస్సా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share